పేటీఎమ్ జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ సుమారు రూ.9,000 కోట్ల (1.40 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను రాబట్టింది. పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాల విస్తరణకు, వినియోగదారులను పెంచుకునేందుకు ఈ నిధులను పేటీఎం
పేటీఎమ్ జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ సుమారు రూ.9,000 కోట్ల (1.40 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను రాబట్టింది. పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాల విస్తరణకు, వినియోగదారులను పెంచుకునేందుకు ఈ నిధులను పేటీఎం మాతృసంస్థ ఒన్97 కమ్యూనికేషన్స్ ఉపయోగించనుంది. ఈ పెట్టుబడుల వల్ల పేటీఎం మార్కెట్ విలువ 7 బి.డాలర్ల (సుమారు రూ.45346 కోట్ల)కు పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారతదేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి మద్దతుగా తాము ఈ పెట్టుబడులు పెట్టినట్లు సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ ఛైర్మన్, ముఖ్యకార్య నిర్వహణాధికారి (సీఈఓ) మసయోషీ సన్ వెల్లడించారు. సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు తమ సంస్థకు ఎంతో గుర్తింపును తీసుకొస్తాయని పేటీఎమ్ వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ అన్నారు. రానున్న 3-5 ఏళ్లలో రూ.10,000 కోట్లు పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు వాలెట్ సంస్థ పేర్కొంది. పేటీఎమ్ ఇప్పటికే వెల్త్ మేనేజ్‌మెంట్; ఇన్సూరెన్స్, డిపాజిట్, రుణ సేవలను అందించేందుకు ప్రణాళికలను సిద్దం చేసింది. సేవలనందించేందుకు గాను పేటీఎమ్ ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టార్టప్ సంస్థలు క్యాపిటల్ ఫస్ట్, క్యాపిటల్ ఫ్లోట్ వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications