గ్లోబ‌ల్ గేమ్ చేంజ‌ర్స్‌లో ముకేశ్ అంబానీకి చోటు

ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించిన రెండో వార్షిక గేమ్‌ చేజింగ్‌ పారిశ్రామికవేత్తల జాబితాలో ఒక‌రిగా నిలిచారు. ప్రస్తుతం ఉన్న స్థాయితో ఏ మాత్రం సంతృప్తి చెందకుండా పరిశ్రమతోపాటుగా కోట్లాది మంది ప్రజల జీవన గమనాన

ప్రపంచంలో పరిశ్రమ గతిని మార్చిన 25 మంది అగ్రశ్రేణి వ్యాపార, పారిశ్రామికవేత్తల్లో రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ స్థానం దక్కించుకున్నారు. కొద్ది నెలల క్రితం రిలయన్స్‌ జియో రాక‌తో టెలికాం రంగం దిశనే మార్చిన ఆయన ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించిన రెండో వార్షిక గేమ్‌ చేజింగ్‌ పారిశ్రామికవేత్తల జాబితాలో ఒక‌రిగా నిలిచారు. ప్రస్తుతం ఉన్న స్థాయితో ఏ మాత్రం సంతృప్తి చెందకుండా పరిశ్రమతోపాటుగా కోట్లాది మంది ప్రజల జీవన గమనాన్ని పూర్తిగా కొత్త దిశకు మరలించిన పారిశ్రామిక, వ్యాపారవేత్తల పేర్ల‌తో ఈ జాబితాను రూపొందిస్తారు. భారతలో సామాన్యునికి స‌మాచార సాంకేతిక‌త‌ను ద‌గ్గ‌ర చేసిన వాడిగా ముకేశ్‌కు ఈ స్థానం దక్కింది.

 ముకేశ్‌అంబానీకి ఫోర్బ్స్ ప‌త్రిక ద్వారా మ‌రో అరుదైన గౌర‌వం

చ‌మురు,స‌హ‌జ వాయు విభాగంలో దిగ్గజంగా ఉన్న ముకేశ్‌ రిలయన్స్‌ జియో పేరుతో టెలికాం మార్కెట్లోకి ప్రవేశించి అత్యంత చౌకగా వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించడం ద్వారా పెద్ద సంచలనానికి కారణం అయ్యారని ఫోర్బ్స్‌ పత్రిక ఉటంకించింది. ఆరు నెలల కాలంలోనే 10 కోట్ల వినియోగ‌దారుల‌ మైలురాయిని చేరడం ద్వారా టెలికాంలో ఏకీక‌ర‌ణ‌కు బాటలు వేశారని తెలిపింది.డిజిటల్‌ కావలసిన ప్రతి ఒక్కటి డిజిటల్‌ అవుతున్నదని, ఆ విభాగంలో భారత వెనుకబడి ఉండలేదని చెప్పిన ముకేశ్ వ్యాఖ్య‌ల‌ను ఆ ప‌త్రిక ప్రస్తావించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+