For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ‌ళ్లీ కొత్త రికార్డుల‌ను న‌మోదు చేసిన సూచీలు

ప్రపంచవ్యాప్తంగా సానుకూల ప‌రిస్థితులు నెల‌కొన్న నేపథ్యంలో మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. రోజు మొత్తం పటిష్టంగా కదిలాయి. చివరికి దేశ‌ మార్కెట్ చ‌రిత్ర‌లోనే గరిష్టాలవద్ద ముగిశాయి.

|

ప్రపంచవ్యాప్తంగా సానుకూల ప‌రిస్థితులు నెల‌కొన్న నేపథ్యంలో మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. రోజు మొత్తం పటిష్టంగా కదిలాయి. చివరికి దేశ‌ మార్కెట్ చ‌రిత్ర‌లోనే గరిష్టాలవద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ 134 పాయింట్లు పెరిగి 30,322 వద్ద నిలవగా.. నిఫ్టీ 44.50(0.47%) పాయింట్లకు పైగా లాభ‌ప‌డి 9,445.40 వద్ద స్థిరపడింది. ముగింపులో ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఎన్‌ఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ సైతం 18,406 వద్ద నిలవడం ద్వారా కొత్త రికార్డు సాధించింది.

 లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే లోహ‌(2.4%), హెల్త్ కేర్‌(1.06%), స్థిరాస్తి(0.94%), బ్యాంకింగ్‌(0.82%) రంగాలు బాగా లాభ‌ప‌డ్డాయి. మ‌రో వైపు రూపాయి బ‌ల‌ప‌డ్డ నేప‌థ్యంలో ఐటీ, టెక్నాల‌జీ కంపెనీల‌కు ఆ సెగ త‌గిలింది. దీంతో టెక్నాల‌జీ(0.46%), ఐటీ(0.41%), క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌(0.08%) న‌ష్టాల‌కు గుర‌య్యాయి.
సెన్సెక్స్‌లో లాభ‌,న‌ష్టాల‌కు గురైన కంపెనీల వివ‌రాలు ఇలా ఉన్నాయి. టాటా స్టీల్ (+4.35), డాక్టర్ రెడ్డీస్ (+ 3.54%), లూపిన్ (+ 2.4%),ఐసీఐసీఐ బ్యాంక్ (+ 1.82%), ఆసియా పెయింట్స్ (+ 1.32%) లాభ‌ప‌డ‌గా, ఇన్ఫోసిస్(-1.24%), హీరో మోటోకార్ప్ (-0.9%), అదానీ పోర్ట్స్ (-0.53%), రిలయన్స్ (-0.53%), యాక్సిస్ బ్యాంక్ (-0.52 %) న‌ష్ట‌పోయిన వాటిలో ఉన్నాయి.

English summary

మ‌ళ్లీ కొత్త రికార్డుల‌ను న‌మోదు చేసిన సూచీలు | two stock market indices closed at new peaks

Domestic shares ended at a record closing high, after government data last week showed that consumer inflation in April eased to its lowest in at least five years, reviving a debate on whether the central bank should cut interest rates.The benchmark BSE Sensex closed at a new peak of 30,322.12, up by 133.97 points or 0.44 per cent and the NSE index Nifty closed higher by 44.50 points or 0.47 per cent at a record 9,445.40.
Story first published: Monday, May 15, 2017, 17:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X