2018 సంవత్సరం మధ్యలోకెల్లా మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేస్ 1 మొత్తం పూర్తవుతుందని అన్నారు. అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... చెన్నై మెట్రో రైలు ప్రాజెక్ట్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్
* చెన్నై మెట్రో రూ.14,600 కోట్లలో రూ.11 వేల కోట్లు రిలీజ్
తమిళనాడు రాజధాని చెన్నైలో కొత్తగా నిర్మించిన భూగర్భ మెట్రో రైలు మార్గాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి సమక్షంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇవాళ ప్రారంభించారు. మొదటి దశలో భాగంగా భూగర్భ రైలు మార్గాన్ని తిరుమంగళం నుంచి నెహ్రూ పార్క్ వరకు నిర్మించారు. ఏడున్నర కిలోమీటర్లు వున్న ఈ రైలు మార్గంలో మొత్తం 8 స్టేషన్స్ వున్నాయి. చెన్నైలో నిర్మించిన తొలి భూగర్భ రైలు మార్గం ఇదే కావడం విశేషం. 2009లో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయంగా రూ.14,600 కోట్లు అవుతుందని నిర్ణయించారు. అందులో ఇప్పటి దాకా రూ.11,300 కోట్లు విడుదల చేశారు. మెట్రో 4 బోగీల కార్ ఒక ట్రిప్ తిరగడం వల్ల 16 బస్సులు, 300 కార్లు, 600 ద్విచక్ర వాహనాల అవసరం ఉండదని భావిస్తున్నారు.

ఈ రైలు మార్గం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి.. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టుకి దివంగత ముఖ్యమంత్రి జయలలిత శంఖస్థాపన చేశారని గుర్తుచేసుకున్నారు. 2018 సగానికల్లా మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేస్ 1 మొత్తం పూర్తవుతుందని అన్నారు. అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... చెన్నై మెట్రో రైలు ప్రాజెక్ట్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్వప్నం అని అన్నారు. ఈరోజు ఆమెని ఎంతో మిస్ అవుతున్నామని గుర్తు చేసుకున్నారు వెంకయ్య నాయుడు. చెన్నై మెట్రో ప్రాజెక్టు మొత్తం పూర్తయితే, 7.75 లక్షల మంది రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుంది. చెన్నై మెట్రో ప్రాజెక్టు విస్తరణకి కేంద్రం చేయదగిన సహాయం అంతా చేస్తుందని ఈ సందర్భంగా కేంద్రమంత్రి వారికి హామీ ఇచ్చారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications