నాలుగు వరుస సెషన్లలో లాభాల తర్వాత శుక్రవారం నష్టాలు
వారాంతం ట్రేడింగ్ నష్టాలతో ముగిసింది. 62.83 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.. 30,188.15 దగ్గర ముగియగా; 21.50 పాయింట్ల నష్టంతో 9,400.90 దగ్గర నిఫ్టీ స్థిరపడింది. అమ్మకాల ఒత్తిడి ఎదురైనా 9400 పాయిం
గత కొద్ది రోజులుగా దూకుడుగా సాగిన దేశీయ మార్కెట్ల జోరుకు కళ్లెం పడింది. ఐఐపీ(పారిశ్రామిక గణాంకాలు), సీపీఐ(వినియోగ దారు ధరల) సూచీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి స్పందించారు. అంతే కాకుండా అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా మదుపర్లు లాభాల స్వీకరణకే ఆసక్తి కనబరిచారు. దీంతో వారాంతం ట్రేడింగ్ నష్టాలతో ముగిసింది.
62.83 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.. 30,188.15 దగ్గర ముగియగా; 21.50 పాయింట్ల నష్టంతో 9,400.90 దగ్గర నిఫ్టీ స్థిరపడింది. అమ్మకాల ఒత్తిడి ఎదురైనా 9400 పాయింట్ల స్థాయిని నిఫ్టీ నిలబెట్టుకోవడం విశేషం.

ఐటీ మినహా అన్ని రంగాల్లోనూ అమ్మకాలు జరిగాయి. బ్యాంకింగ్, వినియోగదారు వస్తు రంగాలు ఎక్కువగా నష్టపోయాయి. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ రంగాల్లో కూడా జోరుగా ఇన్వెస్టర్లు అమ్మకాలు సాగించారు.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే కన్సూమర్ డ్యూరబుల్స్(వినియోగదారు వస్తు) రంగం 0.98% నష్టపోయింది. తర్వాత బ్యాంకింగ్(0.89%), పవర్(0.81%), హెల్త్‌కేర్(0.66%) మేర నష్టపోయాయి. మరో వైపు ఐటీ 1.16%, స్థిరాస్తి(0.81%), టెక్నాలజీ(0.68%), ఆటో(0.12%) మేర లాభపడ్డాయి.
సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో ఇన్ఫోసిస్ (+ 2.12%), హీరో మోటోకార్ప్ (+ 2.11%), సిప్లా (+ 1.00%), సన్ ఫార్మా (+ 0.81%), టాటా మోటర్స్ (+ 0.7%); ఏసియన్ పెయింట్స్ (-3.04%), యాక్సిస్ బ్యాంక్ (-2.8%), ఐసిఐసిఐ బ్యాంక్ (-1.23%), అదానీ పోర్ట్స్ (-1.2%), హెచ్‌డీఎఫ్‌సీ (-0.96%) నష్టపోయిన వాటిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications