సబ్సిడరీలు, అసోసియేట్ల షేర్లు విలువ నష్టాలతో 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1 బిలియన్ మేర కంపెనీకి నష్టాలొచ్చాయని సాఫ్ట్ బ్యాంకు తెలిపింది. దానిలో స్నాప్ డీల్ మాతృ సంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ ప్ర
భారత్ లో పెట్టుబడులతో జపనీస్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంకు గ్రూప్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను 1.4 బిలియన్ డాలర్లు లేదా 9000 కోట్లకు పైగా నష్టాలు వచ్చినట్టు ఈ గ్రూప్ వెల్లడించింది. ముఖ్యంగా భారత స్టార్టప్ కంపెనీలు స్నాప్ డీల్, ఓలా కారణంగా సాఫ్ట్ బ్యాంకుకు ఈ మేర నష్టాలొచ్చినట్టు పేర్కొంది.

సబ్సిడరీలు, అసోసియేట్ల షేర్లు విలువ నష్టాలతో 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1 బిలియన్ మేర కంపెనీకి నష్టాలొచ్చాయని సాఫ్ట్ బ్యాంకు తెలిపింది. దానిలో స్నాప్ డీల్ మాతృ సంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లు కలిగి ఉన్న స్టార్ ఫిష్ ఐ పీటీఈ లిమిటెడ్ ముఖ్యమైందని తెలిపింది. అంతేకాక భారత్ లో తన రెండో అతిపెద్ద పెట్టుబడుల సంస్థ ఓలా వల్ల కూడా 400 మిలియన్ డాలర్లు నష్టపోయినట్టు పేర్కొంది. దీంతో స్నాప్ డీల్, ఓలా వల్ల ఫేర్ వాల్యు వద్ద 1.4 బిలియన్ డాలర్ల నష్టాలను నమోదుచేసినట్టు వెల్లడించింది.

మొట్టమొదటిసారి ఆగస్టు 2013లో స్నాప్‌డీల్లో సాఫ్ట్‌బ్యాంక్ ఒక పెట్టుబడిదారుగా చేరింది. మొత్తానికి ఇప్పటివరకూ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థలో 800మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టినట్టు తెలిసింది. స్నాప్‌డీల్ విషయంలో వచ్చిన అనుకోని నష్టాలతో ప్రస్తుతం దాన్ని ఫ్లిప్‌కార్ట్‌కు అమ్మేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఈ-కామర్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications