బ్రిటన్ బిలియనీర్ల జాబితాలో ఈ ఏడాది భారత సంతతికి చెందిన హిందుజా సోదరులు అగ్రస్థానంలో నిలిచారు. గత సంవత్సరంతో పోల్చితే 3.2 బిలియన్ పౌండ్లు పెరిగిన వీరి సంపద.. ప్రస్తుతం 16.2 బిలియన్ పౌండ్లకు చేరింది
బ్రిటన్ బిలియనీర్ల జాబితాలో ఈ ఏడాది భారత సంతతికి చెందిన హిందుజా సోదరులు అగ్రస్థానంలో నిలిచారు. గత సంవత్సరంతో పోల్చితే 3.2 బిలియన్ పౌండ్లు పెరిగిన వీరి సంపద.. ప్రస్తుతం 16.2 బిలియన్ పౌండ్లకు చేరింది. 'ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్'లో వెయ్యి మందికి చోటు దక్కగా, అందులో 40కిపైగా భారత సంతతివారే కావడం విశేషం.

మొత్తం 134 మంది బిలియనీర్లలో 81 ఏళ్ల శ్రీచంద్ హిందుజా, 77 ఏళ్ల గోపిచంద్ హిందుజా సోదరులు టాప్‌లో నిలిచారు. చమురు, సహజవాయు, ఆటోమోటివ్, సాఫ్ట్‌వేర్, ఇంధనం, మీడియా, బ్యాంకింగ్, ప్రాపర్టీ, హెల్త్‌కేర్ రంగాల పరిశ్రమల్లో పెట్టిన పెట్టుబడుల ద్వారా హిందుజాల సంపద అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఈ క్రమంలోనే గతేడాది రెండో స్థానంలో ఉన్న హిందుజాలు.. ఈ ఏడాది ప్రథమ స్థానంలోకి వచ్చారు.

ఇక ఈ ఏడాది రెండో స్థానంలో ఉక్రెయిన్ వ్యాపారవేత్త లెన్ బ్లవత్నిక్ ఉన్నారు. ఈయన సంపద విలువ 15.9 బిలియన్ పౌండ్లు. కాగా, భారత సంతతి సోదరులే అయిన డేవిడ్, సిమన్ రూబెన్ మూడో స్థానంలోకి పడిపోయారు. వీరి సంపద ఇప్పుడు 14 బిలియన్ పౌండ్లుగా ఉంది. నిరుడు వీరు మొదటి స్థానంలో ఉన్నారు. మరోవైపు ఉక్కు వ్యాపారి లక్ష్మీ నివాస్ మిట్టల్ 13.2 బిలియన్ పౌండ్లతో నాలుగో స్థానంలో నిలిచారు.

యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలగడం (బ్రెగ్జిట్) ఆ దేశ బిలియనీర్లపై ఏమాత్రం ప్రతికూల ప్రభావం చూపలేదని, పైగా నాటి నుంచి 14 శాతం సంపద పెరిగిందని, రికార్డు స్థాయిలో 658 బిలియన్ డాలర్లను తాకిందని తాజా జాబితాలో ది సండే టైమ్స్ చెప్పింది. కాగా, శ్రీ ప్రకాశ్ లోహియా, అనిల్ అగర్వాల్, సునీల్ వాస్వాని, ఆయన కుటుంబం, సిమన్, బాబీ, రాబిన్ అరోరా, నవీన్, వర్ష ఇంజినీర్స్ ఫార్మాస్యూటికల్స్, జస్మిందర్ సింగ్ బిలియనీర్ల జాబితాలో ఈసారి స్థానం సంపాదించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications