అంబుజా సిమెంట్స్‌లో విలీనం అయ్యేందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంగీకారం లభించిందని ఏసీసీ సిమెంట్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకవేళ ప్రతిపాదిత విలీనం సాకారమైన పక్షంలో ఏర్పడే కొత్త సంస్థ టర్నోవరు దా
* రెండో అతిపెద్ద సిమెంట్ కంపెనీగా నూతన సంస్థ
సిమెంటు ఉత్పత్తిలో అంతర్జాతీయ దిగ్గజం లఫార్జ్‌హోల్సిమ్‌లో భాగమైన దేశీ సంస్థలు ఏసీసీ, అంబుజా సిమెంట్స్ విలీన ప్రతిపాదనపై మరింతగా కసరత్తు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను మదింపు చేయాలని ఇరు కంపెనీలు శుక్రవారం తమ తమ బోర్డ్ సమావేశాల్లో నిర్ణయించాయి. వ్యాపారాల విలీనంతో వాటాదారులందరికీ ప్రయోజనం చేకూరగలదనే ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రెండు సంస్థలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. ఇందుకోసం డైరెక్టర్లతో కూడిన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశాయి.

అంబుజా సిమెంట్స్‌లో విలీనం అయ్యేందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంగీకారం లభించిందని ఏసీసీ సిమెంట్స్ ఒక ప్రకటనలో తెలిపింది.ఒకవేళ ప్రతిపాదిత విలీనం సాకారమైన పక్షంలో ఏర్పడే కొత్త సంస్థ టర్నోవరు దాదాపు రూ. 20,425 కోట్లకు పైగా ఉంటుంది. ముంబైకి చెందిన ఏసీసీ 2016లో (జనవరి-డిసెంబర్ ఆర్థిక సంవత్సరం) రూ. 11,158 కోట్ల ఆదాయం ఆర్జించగా.. అంబుజా సిమెంటు రూ. 9,268 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. 63 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో విలీన కంపెనీ సిమెంటు ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న అల్ట్రాటెక్ తర్వాతి స్థానాన్ని దక్కించుకోనుంది. విలీన అవకాశాల వార్తలతో ఫిబ్రవరిలో ఏసీసీ, అంబుజా సిమెంట్ స్టాక్స్ గణనీయంగా లాభపడ్డాయి. ఈ నేపథ్యంలో సోమవారం సైతం రెండు కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications