ఏదైనా కంపెనీకి చెందిన పాత డోంగిల్, డేటా కార్డు, వైఫై రూటర్లను జియో వైఫై 4జీ రూటర్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటే 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. జియో తాజా ఆఫర్ల గురించి తెలుసుకుందాం
ప్రారంభం నుంచి పోటీ కంపెనీలను తలదన్నేలా ఆఫర్లు ఇస్తున్న జియో మరోసారి కొత్త ఆఫర్‌ను వదిలింది. రిలయన్స్ జియో మరోసారి సంచలన డేటాకు సంబంధించిన ఆఫర్లను తన అంతర్జాల వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఏదైనా కంపెనీకి చెందిన పాత డోంగిల్, డేటా కార్డు, వైఫై రూటర్లను జియో వైఫై 4జీ రూటర్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటే 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. జియో తాజా ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

100 శాతం క్యాష్ బ్యాక్ లేదా రూ.2010 విలువైన డేటా
రెండు ప్లాన్స్ గా జియో ఈ సంచలన ఆఫర్ ను ప్రకటించింది. ఒకటి ప్రస్తుత డేటా కార్డు, డోంగిల్, హాట్ స్పాట్ రూటర్ ను జియో డిజిటల్ స్టోర్ లో ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నా 100 శాతం క్యాష్ బ్యాక్ లేదా డివైజ్ ఎక్స్చేంజ్ కు రూ.2010విలువైన 4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది.

408 రీచార్జీ
జియోఫై రూటర్ పొందడానికి కస్టమర్లు రూ.1,999 చెల్లించాల్సి ఉంటుంది.
దాంతో పాటు 309 ప్లాన్ కింద కచ్చితంగా మొదటిసారి 408 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి. 99 రూపాయల ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకుని ఉండాలి. ఇలాంటి వారికి ఉచిత డేటా ఆఫర్ 84 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.

రూ.1999కే జియోఫై పరికరం
కస్టమర్లు చెల్లించిన 1999 రూపాయలను 2010 రూపాయల విలువైన 4జీ డేటాతో పోల్చి చూస్తే కస్టమర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ దాదాపు ఉచితంగా లభించనుంది. ఇక రెండో ప్లాన్ కింద యూజర్లు తమ డేటా కనెక్షన్లు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కచ్చితంగా రీఛార్జ్ చేయించుకోవాల్సిన 408 రూపాయలతో తొలి రీఛార్జ్ చేసుకుంటే చాలు 1,999కే జియోఫై అందుబాటులో ఉంటుంది. కానీ దీనికింద కేవలం 1005 రూపాయల విలువైన 4జీ డేటాను మాత్రమే పొందడానికి వీలుంటుంది.

జియో యాప్‌లు వాడాలంటే ప్రైమ్ మెంబర్ అవ్వాల్సిందే...
కస్టమర్లను నిలుపుకునేందుకు జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను తీసుకొచ్చింది. తద్వారా కస్టమర్లు తర్వాత ఏ రీచార్జీలు చేయించుకున్నా, లేకపోయినా మార్చి 31,2018 జియో సిమ్ వాడేలా ఈ మెంబర్‌షిప్ అవకాశం కల్పిస్తుంది. జియో సిమ్ తీసుకుని ప్రైమ్ సభ్యత్వం తీసుకున్న వారికి మాత్రమే జియో సంబంధిత యాప్‌లు పనిచేసేలా రిలయన్స్ జియో ప్రణాళిక వేసింది. ప్రస్తుతం జియో సేవలు పొందాలనుకునే వారు రూ.309 రీచార్జీ చేయించేలా రిలయన్స్ జియో ఆఫర్ ఇచ్చింది. తద్వారా 84 రోజుల పాటు ప్రతి రోజూ ఉచిత డేటా పొందేలా చేశారు.

సమ్మర్ పర్‌ప్రైజ్ లేకున్నా ధన్‌ధనాధన్ ఉందిగా...
జియో ప్రవేశపెట్టిన సమ్మర్ సర్‌ప్రైజ్ ఆపర్‌ను ట్రాయ్ నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో వినియోగదారులకు అవే ప్రయోజనాలను అందించేందుకు జియో కొత్త మార్గం అన్వేషించింది. జియో ధన్‌ధనాధన్ పేరుతో రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది. యూజర్లు ఎప్పుడైనా ఆ ప్లాన్‌లో ఉన్న ప్యాక్‌లను రీచార్జీ చేయించుకోవచ్చు. జియో వినియోగదారులు మైజియో యాప్‌లో ఎప్పుడైనా ఈ రీచార్జీలు చేసుకునే సదుపాయం ఉంది. ప్రత్యర్థి కంపెనీలను హడలెత్తించే క్రమంలో జియో ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూనే ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!



Click it and Unblock the Notifications