ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు ఇప్పటికే వాటి మెగా సేల్ తేదీలను ప్రకటించాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు కొనుగోళ్ల ఆకర్షణే లక్ష్యంగా భారీ డిస్కౌంట్లకు, డీల్స్‌కు తెరలేపనున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
ఈ-కామర్స్ సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇంతకుముందు ఏడాదికి ఒకసారి ప్రత్యేక ఆఫర్లను తీసుకువస్తున్న సంస్థలు ఇప్పుడు రెండు, మూడు సార్లు బంపర్ ఆఫర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. మన కోసం ఈ-కామర్స్ సంస్థలు పండుగ సీజన్‌ను ముందే తీసుకురావడానికి సిద్ధమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు ఇప్పటికే వాటి మెగా సేల్ తేదీలను ప్రకటించాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు కొనుగోళ్ల ఆకర్షణే లక్ష్యంగా భారీ డిస్కౌంట్లకు, డీల్స్‌కు తెరలేపనున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ఫోన్లు, ఫ్యాషన్, గృహోపకరణాలపై ఆఫర్లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మెగా సేల్స్‌లో కస్టమర్లు ప్రధానంగా ఫ్యాషన్, స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ టెలివిజన్లు, గృహోపకరణాలు వంటి పలు ఉత్పత్తులపై మంచి డీల్స్‌ను పొందొచ్చు. మార్కెట్‌లో అగ్రస్థానం కోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ రెండు సంస్థలు ఇండియన్ మార్కెట్‌లో భారీగానే పెట్టుబడులు పెడుతున్నాయి. చాలా మంది విక్రయదారులను, కొనుగోలుదారులను వాటి వాటి ప్లాట్‌ఫామ్‌లలోకి తెచ్చుకునేందుకు వీలుగా ఇరు సంస్థలు మౌలిక సదుపాయాలను విస్తరించుకుంటూ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి.

ముందు అమెజాన్ సందడి..
భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు, డీల్స్‌తో అమెజాన్ ముందుగా కస్టమర్లను పలకరించనుంది. మే నెల 11 నుంచి 14 వరకు ‘గ్రేట్ ఇండియా సేల్'ను నిర్వహిస్తున్నట్లు సంస్థ ఇప్పటికే ప్రకటించేసింది. అమెజాన్ సేల్ మే 11 అర్ధరాత్రి 12 గంటలకు మొదలై మే 14 రాత్రి 11.59 గంటలకు ముగుస్తుంది. మోటో, వన్‌ప్లస్, శ్యామ్‌సంగ్, సోనీ ఫోన్లపై రాయితీలనిస్తోంది. దుస్తుల్లో అమెరికన్ టూరిస్టర్, ప్యూమా ఈ సేల్‌లో పాల్గొంటున్నాయి. ఇంకా టైటాన్, ఫాస్ట్ ట్రాక్, ఉషా, సెల్లో, బజాజ్, ప్రిస్టీజ్, బీపీఎల్, శ్యామ్‌సంగ్, ఎల్‌జీ, విర్ల్‌పూల్ సంస్థల ఉత్పత్తులపై గొప్ప డిస్కౌంట్లు లభించనున్నాయి.

అమెజాన్‌లో ఏ ఏ ఆఫర్లు వస్తాయి?
- ఫ్యాషన్ కేటగిరీలో 40-80% ఆఫర్; బ్యూటీ ఉత్పత్తులపై 35% వరకూ
- కంప్యూటర్ సంబంధిత వస్తువుల మీద 60% వరకూ ఆఫర్ ఉండనుంది.
- ఎలక్ట్రానిక్ సేల్‌లో 80% వరకూ, హెడ్‌ఫోన్లు, స్పీకర్లపై 60% వరకూ
- హోం అండ్ కిచెన్ ఉత్పత్లుపై 70%వరకూ, ల్యాప్‌టాప్‌లపై 35% వరకూ
- మగవారి, మహిళల వస్త్రాలపై ఫ్లాట్ 40% నుంచి 80% వరకూ
- పవర్ బ్యాంకులపై 70% వరకూ ఆఫర్లు, ప్రింటర్లపై 40% వరకూ రాయితీ
- టెలివిజన్లపై 40% వరకూ, పెన్‌డ్రైవ్‌లపై 65% వరకూ రాయితీలు
- మొబైల్ ఫోన్లకు సంబంధించి హువాయ్ హానర్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.
- లెనోవో వైబ్ కే4 నోట్ రూ. 10999కే.
- శ్యామ్‌సంగ్ జే7 రూ.11,900. శ్యామ్‌సంగ్ గెలాక్సీ జే2 4జీ ఫోన్ రూ. 7590 ధరలో లభిస్తుంది.

మే 14 నుంచి ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ 10' సేల్
ఫ్లిప్‌కార్ట్ తన ‘బిగ్ 10' సేల్‌ను మే నెల 14 నుంచి 18 వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుత ‘బిగ్ 10' సేల్.. ‘బిగ్ బిలియన్ డేస్' సేల్‌కు భిన్నమైనదని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ తన పదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ ‘బిగ్ 10' సేల్‌ను ప్రకటించింది. ‘బిగ్ బిలియన్ డేస్' సేల్ తర్వాత అదేతరహాలో అంతే స్థాయిలో ‘బిగ్ 10' సేల్‌ను తీసుకువస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు.

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు ప్రత్యేకం
ఈ వేసవికి ఫ్లిప్‌కార్ట్ బిగ్‌సేల్ సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీతో జట్టుకట్టింది. కాబట్టి ఆ బ్యాంకు క్రెడిట్ కార్డు కలిగిన వారు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు పొందవచ్చు. వస్తు కొనుగోళ్లపై హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు దారులకు 10% తక్షణ రాయితీ. అంతేకాకుండా శ్యామ్‌సంగ్, అప్పో, వివో, లెనోవో ఫోన్లపై రాయితీలు అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ సిద్దమవుతోంది. అంతే కాకుండా ఈ సమయంలో కొనుగోళ్లు జరిపిన వారికి అంతర్జాతీయ ట్రిప్ గెలుచుకునే అవకాశం సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. టాప్ 20 షాపర్లకు కౌలాలంపూర్ వెళ్లే అవకాశాన్ని ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications