For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాహుబ‌లి2కు రూ.200 కోట్ల భారీ బీమా

సినిమా కోసం రూ. 200 కోట్లకు పైగా బీమా చేసినట్టు ఫ్యూచర్‌ జనరాలీ ఇన్సూరెన్స్‌ కంపెనీ వెల్లడించింది. ఫిల్మ్‌ ప్యాకేజీ ఇన్సూరెన్స్‌ కింద ఈ మొత్తానికి బీమా చేసినట్లు తెలిపింది. ప్రిప్రొడక్షన్‌, పోస్ట్‌

|

విజువల్‌ వండర్‌ 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' సినిమా షూటింగ్ మొద‌ల‌యిన‌ప్ప‌టి నుంచి అంద‌రిలో ఆస‌క్తి ఉంది. అది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నిత్యం ఏదో విధంగా వార్త‌ల్లో ఉంటూ వ‌స్తోంది. ఇప్పుడు దానికి సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆ సినిమా కోసం రూ. 200 కోట్లకు పైగా బీమా చేసినట్టు ఫ్యూచర్‌ జనరాలీ ఇన్సూరెన్స్‌ కంపెనీ వెల్లడించింది. ఫిల్మ్‌ ప్యాకేజీ ఇన్సూరెన్స్‌ కింద ఈ మొత్తానికి బీమా చేసినట్లు తెలిపింది. ప్రిప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే ఈ పాలసీ కింద కవరేజీ ఉంటుందని వివరించింది. 'మరణం, నటులకు అనారోగ్యం, ప్రకృతి విపత్తులు, ప్రమాదాల కారణంగా సినిమా షెడ్యూల్‌ లో జాప్యం జరిగినా బీమా వర్తిస్తుంది. షూటింగ్‌ జరుగుతుండగా అక్క‌డ ఏదైనా వ‌స్తు న‌ష్టం జ‌రిగి, ఖ‌రీదైన ప‌రిక‌రాలు పాడైనా బీమా చెల్లిస్తామ'ని ఫ్యూచర్‌ జనరాలీ ప్రకటనలో పేర్కొంది.

దేశంలో అత్య‌ధిక బ‌డ్జెట్‌తో నిర్మించిన సినిమాలుదేశంలో అత్య‌ధిక బ‌డ్జెట్‌తో నిర్మించిన సినిమాలు

బాహుబ‌లి: ది కన్‌క్లూజన్ సినిమాకు 200 కోట్ల ఇన్సూరెన్స్‌

సినిమాలకు బీమా చేయడం ఇటీవ‌ల‌ పెరుగుతోందని ఫ్యూచర్‌ జనరాలీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కేజీ కృష్ణమూర్తి రావు తెలిపారు. 2017 ఆర్థిక సంవత్సరంలో 160 సినిమాలకు బీమా చేశామని, వీటిలో బాలీవుడ్‌ సినిమాలే ఎక్కువ‌గా ఉన్నాయని అన్నారు. దక్షిణాది సినిమాలపై దృష్టి పెట్టామని,సినీ ప‌రిశ్ర‌మ అవసరాలకు అనుగుణంగా బీమా పాల‌సీలు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించిన ఈ సినిమా భారతదేశంలో భారీ బడ్జెట్‌ తో తెర కెక్కిన తొలి చిత్రంగా నిలిచింది.

Read more about: bahubali movies insurance
English summary

బాహుబ‌లి2కు రూ.200 కోట్ల భారీ బీమా | Bahubali2 got 200 Crore Future Generali Insurance Cover

Future Generali Insurance Company today insured the Telugu movie 'Baahubali 2' for over Rs. 200 crore under its film package insurance product.According to the private insurer, the policy covers the risks related to the film during the pre-production to post-production stage.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X