ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ నిక‌ర లాభంలో 57% పెరుగుద‌ల‌

ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణలోని 22 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవలు అందిస్తున్న ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ) నికర లాభాల్లో రికార్డు సృష్టించింది. మార్చితో ముగిసిన 2016-17 ఆర్

ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణలోని 22 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవలు అందిస్తున్న ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ) నికర లాభాల్లో రికార్డు సృష్టించింది. మార్చితో ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.351.99 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంత‌కు ముందు ఏడాదిలో ఇది కేవ‌లం రూ.222 కోట్లు మాత్ర‌మే ఉండ‌టం గ‌మ‌నార్హం. కేవ‌లం వ్య‌వ‌సాయం మీదే కాకుండా ఎంఎస్ఎంఈ వ్యాపారం, ముద్రా రుణాలు, గృహ రుణాల మీద దృష్టి పెట్ట‌డం వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని బ్యాంక్ ఛైర్మ‌న్ న‌ర్సిరెడ్డి వెల్ల‌డించారు. ఆ బ్యాంకు ఫ‌లితాల‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు మీ కోసం...

గ్రామీణ బ్యాంకుల్లో అత్య‌ధిక లాభం మా బ్యాంకుదే...

గ్రామీణ బ్యాంకుల్లో అత్య‌ధిక లాభం మా బ్యాంకుదే...

అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే బ్యాంక్‌ నికర లాభం57.51 శాతం పెరిగింది. దేశంలో మరే ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ (ఆర్‌ఆర్‌బీ) ఈ స్థాయిలో నికర లాభాలు ఆర్జించలేదని గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో బ్యాంక్‌ చైర్మన్‌ వి నరసి రెడ్డి చెప్పారు. నిధుల సమీకరణ సగటు ఖర్చులను 6.09 శాతం నుంచి 5.75 శాతానికి తగ్గించుకోవడం, మొత్తం రుణాల్లో నికర మొండి బకాయిలను(ఎన్‌పీఏ) 1.4 శాతం నుంచి 0.72 శాతానికి తగ్గడం ఇందుకు బాగా దోహదం చేసిందన్నారు. గత ఆర్థిక సంవత్సరం కొత్తగా 17 శాఖలు ప్రారంభించగా, ఈ ఆర్థిక సంవత్సరం 45 శాఖలు ప్రారంభించనున్నట్టు చెప్పారు.

పెరిగిన రుణ వితరణ

పెరిగిన రుణ వితరణ

గత ఆర్థిక సంవత్సరం దేశ వ్యాప్తంగా బ్యాంకుల రుణ వితరణ అంతంత మాత్రంగానే ఉన్నా ఏపీజీవీబీ మాత్రం మంచి పనితీరు కనబరిచింది. 2015-16 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రుణ వితరణ 16.66 శాతం పెంచుకుంది. దీంతోపాటు మొత్తం వ్యాపారాన్ని 21.07 శాతం వృద్ధి రేటుతో రూ.25,187.11 కోట్లకు పెంచుకుంది. ముద్రా, ప‌ట్ట‌ణ‌,గ్రామీణ ప్రాంతాల్లో గృహ రుణాలు, ద్విచ‌క్ర వాహ‌నాల కోసం అప్పులు, స్వ‌యం ఉపాధి గ్రూపుల‌కు రుణాలు అందించ‌డం వ‌ల్లే ఇది సాధ్య‌మైంది.

డిపాజిట్లపై దృష్టి

డిపాజిట్లపై దృష్టి

గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఏపీజీవీబీ డిపాజిట్ల‌పై బాగా దృష్టి పెట్టింది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో ఏడాది కాల వ్య‌వ‌ధిలో బ్యాంక్‌ డిపాజిట్లు 25.65 శాతం పెరిగి రూ.2,818.58 కోట్లకు చేరాయి. డిసెంబర్‌, 2016 నాటికి బ్యాంక్‌ మొత్తం నిధుల్లో కరెంట్‌ అండ్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ (కాసా) డిపాజిట్లు 36.60 శాతం నుంచి 41.05 శాతానికి చేరడం కూడా వడ్డీ చెల్లింపుల ఖర్చులు తగ్గించుకునేందుకు దోహదం చేసిందని నరసి రెడ్డి చెప్పారు.

కొత్త రంగాలపై దృష్టి

కొత్త రంగాలపై దృష్టి

శాఖల విస్తరణతోపాటు ఈ సంవత్సరం కొత్త రంగాలపై దృష్టి పెట్టాలని ఏపీజీవీబీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఎంఎస్‌ఎంఇలు, స్వయం సహాయ బృందాలు(ఎ్‌సహెచ్‌జి), వాహన రుణాలపై దృష్టి పెడతామని నరసి రెడ్డి చెప్పారు. గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గృహ రుణాలనూ పెద్ద ఎత్తున విస్తరించాలని బ్యాంక్‌ భావిస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+