సెన్సెక్స్‌కు 3 పాయింట్ల జోష్; నిఫ్టీ 9.75 పాయింట్లు డౌన్
మూడు రోజుల విరామం అనంతరం మంగళవారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో సాగిన సానుకూల ప్రభావంతో మార్కెట్ ఆరంభంలో సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభపడి మళ్లీ 30వేల స్థాయిని దాటేస
మూడు రోజుల విరామం అనంతరం మంగళవారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో సాగిన సానుకూల ప్రభావంతో మార్కెట్ ఆరంభంలో సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభపడి మళ్లీ 30వేల స్థాయిని దాటేసింది. అయితే కాసేపటికే సెన్సెక్స్ నష్టాల్లోకి జారిపోయింది. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మధ్యాహ్నానికి మరింత దిగజారి 30వేల దిగువకు చేరింది. చివరకు కేవలం 3 పాయింట్ల లాభాంతో 29,921 వద్ద స్థిరపడింది. మరో సూచీ ఎన్ఎస్ఈ 9.75 పాయింట్లు(0.1%) క్షీణించి 9313 వద్ద ముగిసింది.

రియల్‌ఎస్టేట్ నియంత్రణ, అభివృద్ధి చట్టం(రేరా) అమలు కారణంగా స్థిరాస్తి రంగ షేర్లకు డిమాండ్ కనిపించింది. బీఎస్ఈలో రంగాల వారీ చూస్తే స్థిరాస్తి(1.99%), కన్సూమర్ డ్యూరబుల్స్(1.21%), చమురు,సహజవాయు రంగం(1.05%), మౌలిక రంగం(0.73%) లాభపడ్డాయి. మరో వైపు హెల్త్‌కేర్(0.78%), లోహ(0.57%), మూలధన వస్తు(0.56%), పవర్(0.5%) నష్టాలకు గురయ్యాయి.
సెన్సెక్స్‌లో కంపెనీలా వారీగా గమనిస్తే ఒఎన్జిసి (+ 3.14%), హెచ్‌డీఎఫ్సీ (+ 2.99%), మారుతి (+ 2.76%), గెయిల్ (+ 1.46%), బజాజ్ ఆటో (1.28%) లాభాలను గడించగా లూపిన్ (-2.49%), భారతీ ఎయిర్టెల్ (-2.00%), రిలయన్స్ (-1.71%), సన్ ఫార్మా (-1.59%), ఎన్టిపిసి (-1.4%) నష్టాలను మూటగట్టుకున్నాయి.


Click it and Unblock the Notifications