For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏప్రిల్‌లో వాహ‌నాల అమ్మ‌కాలు జూమ్‌

2017-18 ఆర్థిక సంవ‌త్స‌రాన్ని వాహ‌న త‌యారీ సంస్థ‌లు మంచి వృద్దితో ప్రారంభించాయి. ఏప్రిల్ నెల‌లో అన్ని రంగాల్లో ప్యాసెంజ‌ర్ వాహ‌నాలు రెండంకెల వృద్దిని సాధించాయి. ఈ స్థాయిలో వాహ‌నాల అమ్మ‌కాలు జ‌ర‌గ‌డా

|

2017-18 ఆర్థిక సంవ‌త్స‌రాన్ని వాహ‌న త‌యారీ సంస్థ‌లు మంచి వృద్దితో ప్రారంభించాయి. ఏప్రిల్ నెల‌లో అన్ని రంగాల్లో ప్యాసెంజ‌ర్ వాహ‌నాలు రెండంకెల వృద్దిని సాధించాయి. ఈ స్థాయిలో వాహ‌నాల అమ్మ‌కాలు జ‌ర‌గ‌డానికి డీల‌ర్లు త‌మ‌కు అవ‌స‌ర‌మైన వాహనాల కొనుగోళ్ల‌ను మొద‌ట్లో చేప‌ట్టడమేన‌ని ప‌రిశ్ర‌మ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఏప్రిల్ నెల‌లో జ‌రిగిన అమ్మ‌కాల సంఖ్య మే నెల‌లోనూ కొన‌సాగ‌డం క‌ష్ట‌మ‌ని నిఫుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయ వాహ‌న దిగ్గ‌జం మారుతి సుజుకి ఏప్రిల్ నెల‌లో 1,44,492 వాహ‌న అమ్మ‌కాల‌ను చేప‌ట్టింది. అంత‌కు ముందు సంవ‌త్స‌రం అదే నెల‌తో పోలిస్తే 23.4% పెరుగుద‌ల ఉంది.

 ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో వాహ‌నాల అమ్మకాలు ఆశాజ‌న‌కం

ప్ర‌స్తుతం మారుతి సుజుకి 2 ట్రిలియ‌న్ రూపాయ‌ల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్‌ను తాకింది. హుందాయ్ ఏప్రిల్‌లో దేశీయంగా 44,758 యూనిట్ల అమ్మ‌కాల‌ను జ‌రిపింది. ఇది గతేడాది పోలిస్తే 5.7% ఎక్కువ‌. కొత్త వాహ‌నాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌క‌పోవ‌డంతో పాటు, అమ్మ‌కాల్లో చెప్పుకోద‌గ్గ పురోగ‌తి లేక హుందాయ్ మోటార్స్ స‌త‌మ‌త‌మ‌వుతోంది. మొత్తం ప్యాసెంజ‌ర్ వాహ‌నాల్లో మారుతి సుజుకి, హుందాయ్ సంస్థ‌లు క‌లిసి 65% వాటాను క‌లిగి ఉన్నాయి. ఇతర కంపెనీలు టాటా మోటార్స్‌(23%), హోండా కార్స్(38%) సైతం రెండంకెల వృద్దిని సాధించాయి.

Read more about: vehicles maruti tata motors honda
English summary

ఏప్రిల్‌లో వాహ‌నాల అమ్మ‌కాలు జూమ్‌ | Passenger Vehicles Sales grown in double digit in April this year

Auto major Maruti Suzuki registered its highest ever sales of 144,492 units in April 2017, which is a significant 23.4% increase over the corresponding period last year. In the mini vehicle segment also that includes Alto and WagonR, Maruti posted double-digit growth of 21.9% owing to improved inventory management. It should be noted that the segment otherwise yielded losses for the company in the past fiscal with substantial decline in sales volume.
Story first published: Tuesday, May 2, 2017, 15:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X