30 వేల దిగువకు సెన్సెక్స్
మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో శుక్రవారం దేశీయ మార్కెట్లు దిగాలు పడ్డాయి. గురువారం 100కు పైగా నష్టపోయిన సెన్సెక్స్ వరుసగా రెండో రోజూ నష్టాలను కొనసాగించింది. దేశీయ ప్రధాన సూచీ ఎన్ఎస్ఈ
మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో శుక్రవారం దేశీయ మార్కెట్లు దిగాలు పడ్డాయి. గురువారం 100కు పైగా నష్టపోయిన సెన్సెక్స్ వరుసగా రెండో రోజూ నష్టాలను కొనసాగించింది. దేశీయ ప్రధాన సూచీ ఎన్ఎస్ఈ 38 పాయింట్లు నష్టపోయి 9304 వద్ద స్థిరపడగా, మరో సూచీ సెన్సెక్స్ 111.34 పాయింట్ల క్షీణతతో 29918 వద్ద ముగిసింది.

ప్రభుత్వ బ్యాంకులకు భారీ డిమాండ్ ఏర్పడటంతో ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంకింగ్ అత్యధికంగా 3.3 శాతం లాభాలను గడించింది. ఇదే బాటలో లోహ, ఆటో రంగాలు 1.5 శాతం, 0.8 శాతం చొప్పున పురోగమించాయి. అయితే ఎఫ్‌ఎంసీజీ, స్థిరాస్తి రంగాలు దాదాపు 2 శాతం చొప్పున పడగా.. ఐటీ సైతం 0.5 శాతం బలహీనపడింది. నిఫ్టీ దిగ్గజాలలో ఐటీసీ, ఇన్‌ఫ్రాటెల్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, టెక్ మహీంద్రా, అంబుజా, కొటక్ బ్యాంక్, బీపీసీఎల్, ఇండస్‌ఇండ్, హెచ్‌యూఎల్ 3-1.4 శాతం మధ్య నీరసించాయి. మరోవైపు ఓఎన్‌జీసీ, బీవోబీ, స్టేట్‌బ్యాంక్, మారుతీ, హిందాల్కో, ఏషియన్ పెయింట్స్, బాష్, ఐసీఐసీఐ 4-1.5 శాతం మధ్య పైకి ఎగశాయి.
సెన్సెక్స్‌లో లాభపడిన వాటిలో ఓఎన్జిసి ( 3.76%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( 2.66%), మారుతి (+ 2.42% ), ఐసీఐసీఐ బ్యాంక్ (1.62%), ఆసియా పెయింట్స్ (1.62%), నష్టపోయిన వాటిలో ఐటీసీ (-2.28%), హెచ్‌డీఎఫ్‌సీ(-1.93%), హెచ్డీఎఫ్‌సీ బ్యాంకు (-1.6%), టిసిఎస్ (-1.27%), హెచ్‌యూఎల్ (-1.23%)ఉన్నాయి.


Click it and Unblock the Notifications