రూ.333 ప్లాన్‌తో 90 రోజుల పాటు ప్ర‌తి రోజూ 3జీబీ

టెలికాం సంస్థలన్ని జియో దెబ్బ‌కు ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు ఇస్తున్నాయి. ఉన్న చందాదార్ల‌ను కాపాడుకునేందుకు శ‌క్తికి మించి ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ముచ్చటగ

టెలికాం సంస్థలన్ని జియో దెబ్బ‌కు ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు ఇస్తున్నాయి. ఉన్న చందాదార్ల‌ను కాపాడుకునేందుకు శ‌క్తికి మించి ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ముచ్చటగా మూడు ఆఫర్లు లాంచ్ చేసింది. వాటి వివ‌రాలు గుడ్ రిట‌ర్న్స్ పాఠ‌కుల కోసం..

మూడు ఆఫ‌ర్లు

మూడు ఆఫ‌ర్లు

దిల్ కోల్ కి బోల్(ఎస్టీవీ 349), ట్రిపుల్ ఏస్(ఎస్టీవీ 333), నెహ్లే పే దేహ్లా(ఎస్టీవీ 395) పేర్లతో ఈ ఆఫర్లను లాంచ్ చేసినట్టు బీఎస్ఎన్ ప్రకటించింది. తన ఎస్టీవీ 339 ప్లాన్ ఆఫర్‌ను పునరుద్ధరించినట్టు, దీని కింద రోజుకు 3జీబీ డేటా వరకు అందించనున్నట్టు తెలిపింది. అంతకముందు కేవలం 2జీబీ డేటాను మాత్రమే ఈ టెలికాం సంస్థ ఆఫర్ చేసేది. ఇందులోనే వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయని, వీటి వాలిడిటీ 28 రోజులని తెలుస్తోంది.

 దిల్ కోల్ కె బోల్‌(349)

దిల్ కోల్ కె బోల్‌(349)

దిల్ కోల్ కె బోల్ ప్లాన్ కింద రోజుకు 2జీబీ డేటాను 349 రూపాయల రీఛార్జీతో అందించనుందని తెలిపింది. దీని ప్ర‌కారం మీరు ఉన్న టెలికాం స‌ర్కిల్‌లో లోక‌ల్,ఎస్టీడీ కాల్స్ అప‌రిమితంగా ఉచితంగా అందుబాటులో ఉంటాయి.

ట్రిపుల్ ఎస్‌(333)

ట్రిపుల్ ఎస్‌(333)

అదేవిధంగా ట్రిపుల్ ఏస్ ప్లాన్ కింద 333 రూపాయల రీచార్జీతో 90 రోజుల పాటు రోజుకు 3జీబీ డేటా వాడుకునే సౌకర్యముంటుందని పేర్కొంది. అంటే 90 రోజుల పాటు 270జీబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు. ఈ రీచార్జీకి సంబంధించి మ‌రే ఇత‌ర టెలికాం సంస్థ‌ల‌తో పోల్చి చూసినా ఈ స్థాయిలో ఇదే ఉత్త‌మ ఆఫ‌ర్ అని చెప్ప‌వ‌చ్చు.

నెహ్లె పర్ దెహ్లా(395)

నెహ్లె పర్ దెహ్లా(395)

ఇక మరో ప్లాన్ నెహెల్ పర్ దెహ్లాపై రోజుకు 2జీబీ డేటా చొప్పున 3000 బీఎస్ఎన్ఎల్ టూ బీఎస్ఎన్ఎల్ ఉచిత నిమిషాలు, 1800 నిమిషాల ఇతర మొబైల్ నెట్‌వ‌ర్క్ కాల్స్‌ను చేసుకోవ‌చ్చు. ఈ ప‌థ‌కం 71 రోజుల వరకు వాలిడిటీలో ఉంటుందని కంపెనీ వివ‌రించింది. జియో పోటీని త‌ట్ట‌కునేందుకు బీఎస్ఎన్ఎల్ తన కొత్త ప్లాన్స్ ను మార్కెట్లో ప్రవేశపెడుతుందని తెలుస్తోంది. జియో దెబ్బకు మిగతా టెలికాం సంస్థలు కూడా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+