ఇన్ఫోసిన్‌, కాగ్నిజెంట్‌, విప్రో,క్యాపిజెమినీల‌పై ప్ర‌భావం

హెచ్‌-1బీ వీసాల్లో కంప్యూట‌ర్ రంగానికి సంబంధించి మ‌న దేశ సాఫ్ట్‌వేర్ నిపుణుల‌కు 86% వ‌ర‌కూ వ‌స్తుంటాయి. ప్ర‌స్తుతం అగ్ర‌రాజ్యం తీసుకుంటున్న క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల మూలంగా దాదాపు ఆ వీసాల సంఖ్య 60శాతాన

'Buy American, Hire American ' అనే ప్ర‌చారంలో భాగంగా అమెరికా హెచ్‌1బీ వీసాల క‌ట్ట‌డికి ప‌లు చ‌ర్య‌లు చేప‌డుతుండ‌టంతో ఆ సెగ దేశీయ ఐటీ కంపెనీల‌కు తాకుతోంది. ఉద్యోగుల‌కు జారీచేసే హెచ్‌-1బీ వీసాల్లో కంప్యూట‌ర్ రంగానికి సంబంధించి మ‌న దేశ సాఫ్ట్‌వేర్ నిపుణుల‌కు 86% వ‌ర‌కూ వ‌స్తుంటాయి. ప్ర‌స్తుతం అగ్ర‌రాజ్యం తీసుకుంటున్న క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల మూలంగా దాదాపు ఆ వీసాల సంఖ్య 60శాతానికి లోపే ప‌డిపోయే అవ‌కాశ‌ముందని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇలా ప‌లు దేశీయ ఐటీ సంస్థ‌ల‌ చ‌ర్య‌లు ఎలా ఉండ‌బోతున్నాయో చూద్దాం

1. హెచ్‌1బీ వీసా మార్పులు

1. హెచ్‌1బీ వీసా మార్పులు

అమెరికాలో విదేశీయులు ప‌నిచేసేందుకు వీలుగా జారీ చేసే వీసా నిబంధ‌న‌ల్లో మార్పుల‌పై బుధ‌వారం అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ సంత‌కం చేశారు. తాజా నిర్ణ‌యం భార‌త టెక్నాల‌జీ నిపుణుల‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అమెరిక‌న్ల ఉద్యోగాల‌కు ఈ బిల్లు ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంద‌ని చాలా మంది కాంగ్రెస్ స‌భ్యుల భావ‌న‌. అంతే కాకుండా బిల్లు ఆ దేశ చ‌ట్ట సభ‌ల ఆమోదం పొందితే హెచ్‌1బీ వీసా ఉల్లంఘ‌న‌ల‌కు అడ్డుక‌ట్ట ప‌డుతుంద‌ని ఇద్ద‌రు స‌భ్యులు డారెల్ ఇసా, స్కాట్ పీట‌ర్స్ అభిప్రాయ‌ప‌డ్డారు.

2. మార్పుల త‌ర్వాత ఏమ‌వుతుంది?

2. మార్పుల త‌ర్వాత ఏమ‌వుతుంది?

అమెరికాలోని ఐటీ కంపెనీలు హెచ్‌1బీ వీసాదారుల‌కు ప్ర‌స్తుతం ఏడాదికి 60 వేల డాల‌ర్ల నుంచి 70 వేల డాల‌ర్ల వ‌ర‌కూ చెల్లిస్తున్నాయి. గరిష్టంగా ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో మాత్ర‌మే 80 వేల డాల‌ర్ల చెల్లింపు జ‌రుగుతోంది. అదే అమెరిక‌న్ల‌కు సరాస‌రి ల‌క్ష డాల‌ర్ల వ‌ర‌కూ చెల్లిస్తున్నాయి. ఇప్పుడు మార్పుల అమ‌లు మొద‌ల‌యితే ఏడాదికి హెచ్‌1బీ వీసా క‌లిగిన వారికి 1,30,000 డాల‌ర్లు చెల్లించాల్సి వ‌స్తుంది.

3. అమెరికా అలా చేస్తే మ‌న కంపెనీలు ఇలా...

3. అమెరికా అలా చేస్తే మ‌న కంపెనీలు ఇలా...

ఎక్కువ‌గా అమెరికాలో కార్య‌క‌లాపాలు క‌లిగిన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌, విప్రో, క్యాప్‌జెమినీ సంస్థ‌ల‌కు కొత్త నిబంధ‌న‌లు శ‌రాఘాతంగా మార‌గ‌ల‌వు. సిలికాన్ వ్యాలీలోని ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌లు, కొంత మంతి భార‌త ప్ర‌భుత్వ అధికారుల లాబీయింగ్ కార‌ణంగా వీసా నిబంధ‌న‌ల‌పై ట్రంప్ సంత‌కం ఆల‌స్య‌మైంది. ఇంత లోపే దేశీయ కంపెనీలు ప్ర‌త్యామ్నాయాలు యోచిస్తున్నాయి.

4. ట్రంప్ స‌ర్కారు ఆంక్ష‌ల‌పై నాస్కామ్‌

4. ట్రంప్ స‌ర్కారు ఆంక్ష‌ల‌పై నాస్కామ్‌

మెరిట్ పేరిట హెచ్ 1 బీ వీసాల జారీపై ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అనూహ్య పరిణామాలకు దారి తీస్తుందని నాస్కామ్ హెచ్చరించింది. ప్రస్తుతం లాటరీ పద్దతిలో జారీ చేస్తున్న హెచ్ 1 బీ వీసాల విధానాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికిప్పుడు భారత ఐటీ దిగ్గజాలపై ట్రంప్ ఆదేశాల ప్రభావం ఉండదని కూడా నాస్కామ్ స్పష్టం చేసింది.

 5. అసోచాం ఆందోళ‌న

5. అసోచాం ఆందోళ‌న

ఎన్నో రోజులుగా గుబులు రేపుతున్న కార్య‌నిర్వాహ‌క ఉత్త‌ర్వుల‌పై ట్రంప్ సంత‌కం, ఆ త‌ర్వాత అది చ‌ట్ట సభ‌ల‌కు వెళ్లి చ‌ట్టంగా రూపొందితే ఐటీ ఉద్యోగాల‌కు గండి ప‌డుతుంద‌ని అసోచామ్ ఒక నివేదిక‌లో వెల్ల‌డించింది. వీసా నిబంధ‌న‌ల్లో మార్పు వ‌ల్ల మ‌న సాప్ట్‌వేర్ కంపెనీల నిర్వ‌హ‌ణ వ్య‌యాలు పెరిగే అవ‌కాశ‌ముంద‌ని తెలిపింది. ఈ ప‌రిణామాలు ఇటు ఉద్యోగులు-అటు కంపెనీల లాభాలు వాటి భ‌విష్య‌త్‌పై తీవ్ర ప్ర‌భావం చూపనున్న‌ట్లు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

6. ప‌లు చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో కంపెనీలు

6. ప‌లు చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో కంపెనీలు

ట్రంప్ అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి హెచ్‌1బీ వీసా అక్ర‌మాల‌పై, అమెరిక‌న్ల‌కు ఉద్యోగాలు క‌ల్పించాల‌నే అంశాల‌పై ప్ర‌ధానంగా దృష్టి పెట్టారు. దీంతో దేశీయ కంపెనీలు ఇత‌ర మార్గాల‌ను ఎంచుకుంటున్నాయి. ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం ద్వారా ఖ‌ర్చులు త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇందులో ప్ర‌ధానంగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వాడ‌టం ద్వారా తావున్న చోట‌ల్లా ఆటోమేష‌న్‌ను వినియోగించాల‌నేది కొన్ని ప్ర‌ముఖ ఐటీ కంపెనీల ప్ర‌ణాళిక‌గా ఉంది. అమెరికా విష‌యానికి వ‌స్తే స్థానిక నియామ‌కాలు పెంచే అవ‌కాశం క‌నిపిస్తోంది.

7. ఇన్ఫీ ఏం చేస్తోంది?

7. ఇన్ఫీ ఏం చేస్తోంది?

అత్య‌ధిక ఉద్యోగుల‌ను కంపెనీ, ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ అమెరికాలో స్థానికుల‌నే మ‌రింత మందిని నియ‌మించుకోవ‌డంపై దృష్టి సారించింది. గ‌త 2 సంవ‌త్స‌రాల్లో అమెరికాలో మా ప్రాతినిధ్యాన్ని పెంచుకోవ‌డంతో పాటు మ‌రింత మంది స్థానికుల‌ను నియ‌మించుకోవ‌డంపై దృష్టి పెట్టామ‌ని ఇన్పోసిస్ సీవోవో యూబీ ప్ర‌వీణ్‌రావు పెట్టుబ‌డిదారుల సద‌స్సులో చేసిన వ్యాఖ్య‌లు దీనికి మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. అలాగే అమెరిక‌న్ల‌కు శిక్ష‌ణ ఇచ్చేందుకు కేంద్రాలు కూడా నెల‌కొల్ప‌నున్న‌ట్లు తెలిపారు.

8. కాగ్నిజెంట్‌

8. కాగ్నిజెంట్‌

సాఫ్ట్‌వేర్ రెవెన్యూల ప‌రంగా అంత‌ర్జాతీయ దిగ్గ‌జాల్లో ఒక‌టైన కాగ్నిజెంట్ ఎక్కువ‌గా భార‌తీయ వృత్తినిపుణుల‌ను అమెరికా తీసుకెళ్లి ప్రాజెక్టుల‌ను పూర్తిచేస్తుంటుంది. అంతే కాకుండా ఆ సంస్థ‌కు ఉన్న మొత్తం ఉద్యోగుల్లో 75% మంది భార‌త్ కేంద్రంగా ప‌నిచేస్తున్నారు. ఈ కంపెనీ ఉద్యోగాల కోత‌కు ప్ర‌ణాళిక‌లు ర‌చించింది. మొత్తం ఉద్యోగుల సంఖ్య‌లో 5 శాతాన్ని త‌గ్గించాల‌ని గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలోనే నిర్ణ‌యించింది. ఈ సంఖ్య‌ను చూస్తే మొత్తం 2,60,000లో దాదాపు క‌నీసం 10 వేలుగా ఉండే అవ‌కాశం ఉంది.

9. ఉద్యోగాల కోత‌కు విప్రో

9. ఉద్యోగాల కోత‌కు విప్రో

ఖ‌ర్చులు త‌గ్గించేందుకు అన్నీ ఐటీ కంపెనీలు మొద‌ట మొగ్గుచూపే మార్గం ఉద్యోగాల‌ను త‌గ్గించ‌డం. ఈ ప‌ర్వం ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో విప్రోతో మొద‌ల‌యిన‌ట్ల‌యింది. విప్రోలో దాదాపు 2వేల ఉద్యోగుల‌ను తొల‌గిస్తార‌ని ఐటీ వ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌ల‌యింది. ప‌నితీరు బాగోలేద‌నే పేరుతో విప్రో కంపెనీ వంద‌ల మంది ఉద్యోగుల‌ను ఇంటికి పంపించింది. అయితే అధికారికంగా ఎటువంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌న‌ప్ప‌టికీ ఇప్ప‌టికే 600 మందిని తొల‌గించార‌ని తెలుస్తోంది.

10. క్యాప్‌జెమినీ ఏం చేస్తోంది...

10. క్యాప్‌జెమినీ ఏం చేస్తోంది...

భార‌త్‌లో ఉన్న ల‌క్ష మంది ఉద్యోగుల‌ను డిజిట‌ల్ నైపుణ్యాల‌లో తీర్చిదిద్దేందుకు క్యాప్‌జెమినీ ప్ర‌య‌త్నిస్తోంది. అమెరికా అవుట్‌సోర్సింగ్‌కు ఇబ్బందులు తెచ్చిపెడుతుండ‌టంతో ప్ర‌త్యామ్నాయ‌ల‌పై ఈ సంస్థ దృష్టిపెట్టింది. అంతే కాకుండా ఫ్రెష‌ర్స్ నియామ‌కాల విష‌యంలో సైతం దూకుడుగా వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తున్న‌ది. మామూలుగా 15-20 శాతాన్ని తీసుకోవాల‌ని పెట్టుకున్న లక్ష్యాన్ని 40 శాతానికి పెంచార‌ని కంపెనీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

11. ఫ్రెష‌ర్స్ నియామ‌కాల‌పై ప్ర‌భావం

11. ఫ్రెష‌ర్స్ నియామ‌కాల‌పై ప్ర‌భావం

తాజా నియామ‌కాల‌పై హెచ్1బీ వీసా ప్ర‌భావం బాగా ప‌డ‌నున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. కేవ‌లం ఉద్యోగులను తొల‌గించ‌డ‌మే కాదు కొత్త వారిని తీసుకునే విష‌యంలో సైతం ఆచితూచి వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. ఇంత‌కుముందు ఇంజినీర్లు చేసే ప‌నిని ఆటోమేష‌న్ ద్వారా చేయించ‌డం కార‌ణంగా త‌మ నియామ‌కాలను 60% త‌గ్గించిన‌ట్లు దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తెలిపింది. 2016-17లో కేవ‌లం 6320 కొత్త వారు జ‌త చేరారు. అంత‌కు ముందు ఏడాది నియ‌మాకాల సంఖ్య 17,857గా ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+