రాణించిన స్థిరాస్తి, వాహన రంగాలు
దేశీయ మార్కెట్లు వారం చివరి రోజు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో కొనుగోళ్ల ఉత్సాహం కన్పించినప్పటికీ.. అది ఎంతోసేపు నిలవలేదు. దీంతో సూచీలు నష్టాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల
ఎఫ్ఎంసీజీ,హెల్త్ కేర్ రంగాలు దిగలాగాయ్
దేశీయ మార్కెట్లు వారం చివరి రోజు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో కొనుగోళ్ల ఉత్సాహం కన్పించినప్పటికీ.. అది ఎంతోసేపు నిలవలేదు. దీంతో సూచీలు నష్టాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో గురువారం దేశీయ సూచీలు లాభాలను ఆర్జించిన విషయం తెలిసిందే. శుక్రవారం కూడా అదే జోరుతో మార్కెట్ ఆరంభం అయినప్పటికీ.. పలు కారణాలతో మధ్యాహ్నానికి సూచీలు డీలాపడ్డాయి.ఈ వారంలో దేశీయ పెట్టుబడిదారులతో పాటు, ఎఫ్‌పీఐలు స్టాక్‌లను విక్రయించేందుకు ప్రయత్నించారు.

శుక్రవారం ఒకానొక దశలో సెనెక్స్ 150 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 9200కు చేరువగా వచ్చింది. అయితే ఆ ఉత్సాహం ఎంతోసేపు కొనసాగలేదు. పారిస్‌లో ఉగ్రదాడి, ఆసియా మార్కెట్ల ప్రభావంతో ఒక్కసారిగా సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి.
శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 57 పాయింట్లు నష్టపోయి 29,365 వద్ద నిలవగా; నిఫ్టీ 17 పాయింట్లు కోల్పోయి 9,119 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్, ఎన్టీపీసీ, ఏసియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ లాభాలను గడించగా; సన్‌ఫార్మా,సిప్లా, ఐటీసీ, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ నష్టపోయిన వాటిలో ముందున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో భారతీ ఇన్‌ఫ్రాటెల్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా షేర్లు లాభపడగా.. సన్‌ఫార్మా, విప్రో, బ్యాంక్ ఆఫ్ బరోడా, అదానీపోర్ట్స్, గ్రాసిమ్ షేర్లు నష్టపోయాయి.


Click it and Unblock the Notifications