86 పాయింట్ల లాభంలో ముగిసిన సెన్సెక్స్
దేశీయ ఇన్వెస్టర్లు ఇటీవల తక్కువ స్థాయిలకు వెళ్లిన స్టాక్‌లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపడంతో గురువారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. త్రైమాసిక ఫలితాల్లో నిరాశపరిచిన ఇన్ఫోసిస్, టీసీఎస్
దేశీయ ఇన్వెస్టర్లు ఇటీవల తక్కువ స్థాయిలకు వెళ్లిన స్టాక్‌లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపడంతో గురువారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. త్రైమాసిక ఫలితాల్లో నిరాశపరిచిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బీఎస్ఈ సూచీ 85.82 పాయింట్ల లాభంతో 29,422.39 వద్ద ముగియగా; నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో 9136 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(2.14%), వినియోగదారు వస్తువులు(1.23%), ఐటీ(0.99%), టెక్నాలజీ(0.96%) లాభపడగా; మరో వైపు బ్యాంకింగ్( 0.53%), చమురు,సహజవాయు(0.25%), పవర్(0.17%), హెల్త్‌కేర్(0.14%) నష్టపోయాయి.
గెయిల్(2.02%), అదానీ పోర్ట్స్(1.83%), గ్రాసిం(1.82%), బ్యాంక్ ఆఫ్ బరోడా టాప్ గెయినర్స్‌గా నిలవగా, బీవోబీ, గెయిల్, ఐబీ హౌసింగ్, అదానీ పోర్ట్స్, జీ, అల్ట్రాటెక్, టెక్‌మహీంద్రా, కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ తదితరాలు లాభపడ్డాయి. ఐసీఐసీఐ, యాక్సిస్(-2.2%), యెస్ బ్యాంక్(3.73%), ఐవోసీ, టాటా పవర్, ఇన్‌ఫ్రాటెల్, పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా నష్టపోయాయి.


Click it and Unblock the Notifications