వచ్చే 18 నెలల్లో వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ
ఈ నెల ప్రారంభంలో జరిగిన ద్రవ్యపరపతి సమీక్షలో సెకండరీ వడ్డీరేటును పెంచినప్పటికీ, నగదు లభ్యత ఎక్కువగా ఉందనే కారణంతో కీలక రెపో రేటును మార్పులు చేయలేదు. ఇదే విధమైన పాలసీని ఆర్బీఐ వచ్చే 18 నెలల పాటు కొనసా
వడ్డీరేట్లపై ఆశలు పెంచుకుంటున్న వివిధ వర్గాలను ఆర్‌బీఐ వరుసగా నిరాశపరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ద్వైమాసిక సమీక్షల్లో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతుంది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ద్రవ్యపరపతి సమీక్షలో సెకండరీ వడ్డీరేటును పెంచినప్పటికీ, నగదు లభ్యత ఎక్కువగా ఉందనే కారణంతో కీలక రెపో రేటును మార్పులు చేయలేదు. ఇదే విధమైన పాలసీని ఆర్బీఐ వచ్చే 18 నెలల పాటు కొనసాగించనుందట. వచ్చే ఏడాది వరకు ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచనున్నట్లు రాయిటర్స్ నిర్వహించిన ఒక పోల్‌లో తెలిసింది.

35 మందికి పైగా ఆర్థికవేత్తలపై ఏప్రిల్ 10-19 మధ్య జరిపిన పోల్‌లో ఈ విషయం వెల్లడైంది. 2018 నాలుగో త్రైమాసికం వరకు ఆర్బీఐ రెపోరేటును 6.25 శాతంగానే ఉంచనున్నట్టు తెలిసింది. అంతేకాక రివర్స్ రెపో రేటు 6.00 శాతం నుంచి మార్చకుండా ఉండే అవకాశాలు ఉన్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. రిజర్వు బ్యాంకుకు సంబంధించి ద్రవ్యోల్బణం అతిముఖ్యమైన ఆందోళనకరమైన అంశంగా మారిందని, ప్రస్తుతం సులభతరమైన ద్రవ్యవిధానానికి ఇది తూట్లు పొడుస్తుందని క్రిసిల్‌కు చెందిన ప్రధాన ఆర్థికవేత్త ధర్మకీర్తి జోషి అభిప్రాయపడ్డారు.

గత నెల వార్షిక వినియోగదారుల ద్రవ్యోల్బణం 3.81 శాతం పెరిగిందని, 2016 అక్టోబర్ తర్వాత అంత వేగవంతమైన పెరుగుదల ఇదేనని అన్నారు. ఇది ఆర్బీఐ నిర్దేశించుకున్న 4 శాతానికి దగ్గరగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగి 5 శాతానికి రావొచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దీంతో వడ్డీరేట్ల కోత అంచనాలను వారు తగ్గిస్తున్నారు. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడానికే ఆర్బీఐ మొగ్గుచూపుతుందని పేర్కొంటున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications