ప్రతి ఆదివారం పెట్రోల్, డీజిల్ బంకుల మూతకు సిద్ధమవుతున్న రాష్ట్రాలకు తాజాగా తమిళనాడు జతకూడింది. తమ రిటైల్ అవుట్ లెట్లను మే14 నుంచి ప్రతి ఆదివారం మూసివేయనున్నామని తమిళనాడు పెట్రోలియం డీలర్స్ అసోసియే
ప్రతి ఆదివారం పెట్రోల్, డీజిల్ బంకుల మూతకు సిద్ధమవుతున్న రాష్ట్రాలకు తాజాగా తమిళనాడు జతకూడింది. తమ రిటైల్ అవుట్ లెట్లను మే14 నుంచి ప్రతి ఆదివారం మూసివేయనున్నామని తమిళనాడు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, ఇండియన్ పెట్రోలియం డీలర్స్ కన్సార్టియం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సురేష్ కుమార్ తెలిపారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ "మన్ కి బాత్" కార్యక్రమం సందర్భంగా ఇచ్చిన ఇంధన ఆదా పిలుపుకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల సంఖ్య ఎనిమిదికి చేరిందని అసోసియేషన్ ప్రకటించింది.

తమిళనాడు, కేరళ, కర్నాటక, పుదుచ్చేరి, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర, హర్యానాలతోపాటుగా తమిళనాడులో సుమారు 20వేల అవుట్‌లెట్స్ ప్రతి ఆదివారం మూతపడనున్నట్టు చెన్నై పెట్రోల్ బంకుల యాజమానుల సంఘం మంగళవారం ప్రకటించింది. తాము కొన్ని సంవత్సరాల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కానీ ఆయిల్ కంపెనీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం అమలును వాయిదా వేసినట్లు తెలిపాయి. ఇకపై ఆదివారాలు పెట్రోల్ బంకులను మూసివేసేందుకు తాము కూడా నిర్ణయించామని ఎనిమిది రాష్ట్రాల్లో మే 14నుంచి పెట్రోల్ పంపులు ఆదివారాలు 24 గంటలు పనిచేయవని ప్రకటించారు. ఈ నిర్ణయంతో తమకు రూ.150 కోట్ల నష్టం రానుందని అంచనావేశారు. అయితే ఆదివారం డిమాండ్ 40శాతం తగ్గుతుందని చెప్పారు.

మరోవైపు అసోసియేషన్ నిర్ణయానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు మద్దతు ప్రకటించాయా అని అడిగినప్పుడు, త్వరలో తమ నిర్ణయాన్ని వారికి తెలియచేస్తామని సురేష్ కుమార్ చెప్పారు. అలాగే పెట్రోల్ బంకుల మార్జిన్ల పెంపుపై ప్రశ్నించినపుడు దీనిపై అసోసియేషన్ చర్చిస్తోందని త్వరలోనే నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలిపారు. పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బందిలో ఎవరో ఒకరు కచ్చితంగా బంకుల వద్ద ఉంటారని, తద్వారా అత్యవసర సమయంలో పెట్రోల్ అందించనున్నట్లు చెప్పారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications