అమెరికాలో పనిచేసే విదేశీ ఉద్యోగులపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించేందుకు సిద్దమవగా, ఇప్పుడు ఆస్ట్రేలియా సైతం తమ పౌరుల ఉపాధి అవకాశాల కోసం రక్షణాత్మక చర్యలను ఆరంభించింది. విదేశీ కార్మికులు త
అమెరికాలో పనిచేసే విదేశీ ఉద్యోగులపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించేందుకు సిద్దమవగా, ఇప్పుడు ఆస్ట్రేలియా సైతం తమ పౌరుల ఉపాధి అవకాశాల కోసం రక్షణాత్మక చర్యలను ఆరంభించింది. విదేశీ కార్మికులు తమ దేశంలో వచ్చి పనిచేయడాన్ని నిరోధించేందుకు వీలుగా ఆస్ట్రేలియా 457 వర్క్ వీసాలను రద్దు చేసింది. ఆస్ట్రేలియా కంపెనీలు వివిధ దేశాల నుంచి ఉద్యోగులను తీసుకొచ్చుకునేందుకు వీలుగా ఉపయోగపడే అనుమతులనే వర్క్ వీసాలంటారు. వివిధ రంగాల్లో నిపుణులను ఈ విధంగా విదేశాల నుంచి రప్పించుకుంటారు. స్థానికులకు ఉపాధి కొరవడుతుందన్న నెపంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. "వలసల ఆధారంగా ఏర్పడిన దేశం మనది. అయితే నిజం ఏంటంటే ఆస్ట్రేలియా ఉద్యోగాల్లో ఆస్ట్రేలియా పౌరులకు ప్రాధాన్యత ఉండాలి. కాబట్టి 457 వీసాలను రద్దు చేస్తున్నాం." అని కొత్త వీసా పాలసీ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్బిల్ చెప్పారు. రద్దు చేసిన ఆస్ట్రేలియన్లకే చెందాలని ఆయన అన్నారు. ఈ 457 వర్క్ వీసా స్థానంలో కొత్త తాత్కాలిక వర్క్ వీసాలను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications