లండన్‌లో విజయ్ మాల్యా అరెస్ట్
కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా లండన్‌లో అరెస్ట్ అయ్యారు. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను వెస్ట్ మినిస్టర్ మెజీస్ట్రేట్ ముందు ప్రవేశపెడతా
కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా లండన్‌లో అరెస్ట్ అయ్యారు. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను వెస్ట్ మినిస్టర్ మెజీస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. రూ.9000 కోట్ల రుణం తీసుకుని ఎగవేతకు పాల్పడుతున్న కేసులో ఆయన ప్రధాన నిందితుడు. ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా ఏఏ బ్యాంకుకు ఎంత అప్పు ఉన్నాడో తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
విజయ్ మాల్యా అత్యధికంగా స్టేట్ బ్యాంక్ నుంచి రుణం పొందాడు. ఎస్‌బీఐ నుంచి తీసుకున్న రూ.1623 కోట్లలో కేవలం రూ.155 కోట్లను తిరిగి రాబట్టుకోగలిగారు. ఈ విషయంలో ఎస్‌బీఐ పలు మార్లు కోర్టును ఆశ్రయించింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ1500 కోట్ల అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పులో ఎక్కువ శాతం కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసమే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.

ఐడీబీఐ బ్యాంక్
దేశంలో పరిశ్రమల అభివృధ్దికోసం ఉద్దేశించిన బ్యాంకు ఐడీబీఐ. ఈ బ్యాంకు నుంచి రూ. 800 కోట్ల రుణం పొందాడు. ఈ రుణం తీసుకున్నప్పటి నుంచి ఎయిర్‌లైన్స్‌లో తలెత్తిన సమస్యలతో లిక్కర్ డాన్ సతమతమవుతున్నాడు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.650 కోట్ల రుణం తీసుకున్నాడు. ముంబయి ప్రధాన కేంద్రంగా ప్రారంభమైన బ్యాంక్ ఇది. 1969లో పలు బ్యాంకులు ప్రభుత్వపరమైనప్పుడు ఉన్న వాటిలో ఇది కూడా ఒకటి.

వారెంటుల మీద వారెంటులు
ఎస్‌బీఐ నేతృత్వంలోనే బ్యాంకుల కన్సార్టియం ఆయనకు అప్పులు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక పక్క నిధుల కొరతతో సతమతమవుతుంటే మరో పక్క ఇలాంటి వ్యాపారులు చేసిన ఎగవేతల కారణంగా ఎన్‌పీల గుదిబండతో కునారిల్లుతున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఇండియాకు రూ.410 కోట్ల బకాయి పడి ఉన్నాడు.

రూ.500 కోట్ల లోపు తీసుకున్న అప్పులు
యూకో బ్యాంకు నుంచి రూ.320 కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్ నుంచి రూ. 310 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ నుంచి రూ.150 కోట్లు, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు నుంచి రూ.140 కోట్లు, ఫెడరల్ బ్యాంక్ నుంచి రూ. 90 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి రూ. 60 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ. 50 కోట్లు తీసుకున్నాడు.


Click it and Unblock the Notifications