ఎయిర్టెల్ రూ.399 ప్లాన్‌తో 70 రోజుల 70 జీబీ
జియో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను నిలిపివేసింది. కానీ అంతలోనే అందరికీ షాక్ ఇస్తూ జియో ధన్ ధనా ధన్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. చాలా మంది ఎయిర్‌టెల్ నుంచి అదే స్థాయి ఆఫర్ కోసం చూస్తున్నారు. ఎయిర్టె
ట్రాయ్ ఆదేశాల మేరకు జియో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను నిలిపివేసింది. కానీ అంతలోనే అందరికీ షాక్ ఇస్తూ జియో ధన్ ధనా ధన్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. చాలా మంది ఎయిర్‌టెల్ నుంచి అదే స్థాయి ఆఫర్ కోసం చూస్తున్నారు. ఎయిర్‌టెల్ సైతం రూ.399 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాల్స్, 70 జీబీ డేటాను ప్రవేశపెట్టి వినియోగదారులను సంతోషరిచింది. దీని గురించి మరిన్ని అంశాలను తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ రూ.399
ఎయిర్‌టెల్ తాజా ఆఫర్ ప్రకారం రూ.399తో రీచార్జ్ చేసుకుంటే 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1జీబీ 4జీ డేటాను వాడుకోవచ్చు. దీంతో పాటు అపరిమిత కాల్స్ ఉచితం. అయితే ఇది 2జీ లేదా తీజీ నెట్‌వర్క్‌ల నుంచి 4జీ నెట్‌వర్క్‌కు మారేవారికి మాత్రమే అని. మొత్తంగా ఇది 4జీ వినియోగదారులకు మాత్రమేనని ప్రముఖ టెలికాం బ్లాగర్ సంజయ్ బఫ్నా ట్వీట్ చేశారు.

జియో ధన్ ధనా ధన్
సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను ఉపసంహరించుకోవాలని ట్రాయ్ సూచించడంతో జియో వెంటనే ధన్ ధనా ధన్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. దాదాపు అదే ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందించడం దీని ఉద్దేశం. రూ.309తో రీచార్జీ చేసుకుంటే రోజుకు 1జీబీ డేటా చొప్పున 84 రోజుల పాటు డేటా, కాల్స్ ఆఫర్‌లు ఉంటాయి.

ఎయిర్‌టెల్ ఆఫర్‌పై అధికారిక ప్రకటన రాలేదు
అయితే ఈ ఆఫర్‌కు సంబంధించి ఎయిర్‌టెల్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీంతో పాటు ఎయిర్‌టెల్ ప్రతిరోజు 1జీబీ, 2జీబీ వాడుకునేలా మరో 2 ప్రీపెయిడ్ ప్లాన్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధిక విలువ కలిగిన వినియోగదారుల్లో ఎవరినీ కోల్పోయేందుకు సిద్దంగా లేని ఎయిర్‌టెల్ సత్వరమే జియోకు పోటీగా ఆఫర్‌ను ప్రకటించాల్సి వచ్చింది.

ట్రాయ్‌కు ఫిర్యాదు
టెలికాం రంగాన్ని విస్తుగొలిపేలా జియో ప్రైమ్ సభ్యత్వం కలిగిన వారికి సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ నిబంధనలకు అనుగుణంగా లేనందున సాధ్యమైనంత త్వరగా ఉపసంహరించాలని ఏప్రిల్ 6న ట్రాయ్ ఆదేశించింది. అయితే ట్రాయ్ ఆదేశించిన తర్వాత కూడా సదరు ఆఫర్‌ను నిలిపివేయడంలో రిలయన్స్ జియో అలసత్వం ప్రదర్శించిందని టీడీశాట్‌కు భారతీ ఎయిర్‌టెల్ ఫిర్యాదు చేసింది. టీడీశాట్ అనేది టెలికాం సంస్థల మధ్య నెలకొనే వివాదాలను, వినియోగదారులు కంపెనీలపై చేసే ఫిర్యాదులను పరిష్కరించే ప్రభుత్వం నియమించిన ఒక ట్రిబ్యునల్.


Click it and Unblock the Notifications