180 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్
అంతర్జాతీయ పరిస్థితులకు తోడు, ఇన్పోసిస్ ఆదాయ అంచనాలు ఆశాజనకంగా లేని కారణంగా దేశీయ మార్కెట్లు రెండో రోజూ నష్టాల బాట పట్టాయి. ట్రేడర్లు ఉదయం నుంచి అమ్మకాలకే మొగ్గుచూపారు. దీంతో రోజంతా బలహీ
అంతర్జాతీయ పరిస్థితులకు తోడు, ఇన్పోసిస్ ఆదాయ అంచనాలు ఆశాజనకంగా లేని కారణంగా దేశీయ మార్కెట్లు రెండో రోజూ నష్టాల బాట పట్టాయి. ట్రేడర్లు ఉదయం నుంచి అమ్మకాలకే మొగ్గుచూపారు. దీంతో రోజంతా బలహీనంగా సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు నష్టాలతోనే ముగిశాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్ రెవెన్యూ గైడెన్స్ కారణంతో ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిళ్లకు గురయ్యాయి. దీంతో సెన్సెక్స్ 180 పాయింట్లకు పైగా కోల్పోగా.. నిఫ్టీ 9,200 దిగువకు చేరింది. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 182 పాయింట్లు నష్టపోయి 29,461 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో 9,151 వద్ద ముగిసింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే లోహ రంగం(2.84%), ఐటీ(2.73%), టెక్నాలజీ(2.62%),మూలధన వస్తువులు(0.97%) బాగా నష్టపోగా; మరో వైపు చమురు,సహజవాయు(1.04%), స్థిరాస్తి(0.92%), హెల్త్‌కేర్(0.64%), పీఎస్‌యూ(0.49%) లాభాల బాట పట్టాయి.
కంపెనీల వారీగా చూస్తే ఇన్ఫోసిస్(3.86%), భారతీ ఎయిర్‌టెల్(3.03%), టాటా స్టీల్(2.92%), టీసీఎస్(2.77%), టాటా మోటార్స్(2.63%) నష్టాలకు గురవ్వగా; సన్‌ఫార్మా(1.39%), పవర్ గ్రిడ్(0.94%), రిలయన్స్(0.75%), ఐసీఐసీఐ బ్యాంకు(0.39%), హెచ్‌యూఎల్(0.38%) లాభాలను గడించాయి.


Click it and Unblock the Notifications