For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకు ఖాతా,ఆధార్ అనుసంధానం ఏప్రిల్ 30లోపు పూర్త‌వ్వాల్సిందే

ముఖ్యంగా 2014 జూలై నుంచి 2015 ఆగ‌స్టు వ‌ర‌కూ తెరిచిన బ్యాంకు ఖాతాలను ఏప్రిల్ 30లోగా ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుందని ఆదాయం పన్ను విభాగం తెలిపింది. ఈ కొత్త గడువులోగా వినియోగదారులు ఆధార్ నెంబ

|

ఈ నెల 30లోగా ఆధార్‌తో అనుసంధానం కాని బ్యాంకు ఖాతాలను అధికారులు మూసివేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా 2014 జూలై నుంచి 2015 ఆగ‌స్టు వ‌ర‌కూ తెరిచిన బ్యాంకు ఖాతాలను ఏప్రిల్ 30లోగా ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుందని ఆదాయం పన్ను విభాగం తెలిపింది. ఈ కొత్త గడువులోగా వినియోగదారులు ఆధార్ నెంబర్లు ఇవ్వకపోయినా, స్వయంగా తమ ఖాతాలను నిర్ధారించుకోక పోయినా వాటిని నిలిపివేసే అధికారం బ్యాంకులు,ఇతర ఆర్థిక సంస్థలకు ఉంటుందని ఆదాయం పన్ను విభాగం తెలిపింది. విదేశీ పన్నుల అమలు చట్టం పరిధిలోకి వచ్చే ఖాతాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన వివరాలను ఖాతాదారుల నుంచి సేకరించాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అధికారులు కోరారు.

 బ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధానం

అమెరికాతో ఫారిన్ ట్యాక్స్ కాంప్లియెన్స్ యాక్ట్‌(ఫ‌ట్కా) ఒప్పందం కుదుర్చుకున్న నేప‌థ్యంలో ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఈ విధ‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. నిజానికి ఇప్పుడు ఇచ్చిన గ‌డువు చాలా రోజులు పొడిగింప‌బ‌డిన త‌ర్వాత‌ది. ఆగ‌స్టు 31,2016లోగా అన్ని ఆర్థిక సంస్థ‌లు స్వ‌యం ధ్రువీక‌ర‌ణ, రుజువు ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ గ‌డువును పొడిగించుకుంటూ వ‌చ్చి ఏప్రిల్ 30ని తుది గ‌డువుగా నిర్ణ‌యించారు.

English summary

బ్యాంకు ఖాతా,ఆధార్ అనుసంధానం ఏప్రిల్ 30లోపు పూర్త‌వ్వాల్సిందే | Bank accounts to be linked to Aadhar card by April 30 or face blockade

In its latest step to ensure that all cash remains accountable, the Income Tax department has announced that it is now, compulsory for all customers to link any bank accounts opened between July 2014 and August 2015 to submit their Know Your Customer (KYC) documents and their Aadhar number by 30 April. Failing to do so could mean that the account gets blocked.
Story first published: Thursday, April 13, 2017, 10:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X