వేసవికి ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు అందిస్తున్న అద్భుత‌మైన ఆఫ‌ర్

ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. వినియోగ‌దారుల‌కు ఉత్త‌మ ఆఫ‌ర్ల్ ఇవ్వ‌డంలో ఒక‌దానితో మ‌రొక‌టి పోటీప‌డుతూ ఉంటాయి. వాటి వైపు నుంచి మ‌న‌వైపు నుంచి ఆలోచిస్తే క‌స్ట‌మ‌ర్లు ప్ర‌యోజ‌నం పొం

ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. వినియోగ‌దారుల‌కు ఉత్త‌మ ఆఫ‌ర్ల్ ఇవ్వ‌డంలో ఒక‌దానితో మ‌రొక‌టి పోటీప‌డుతూ ఉంటాయి. వాటి వైపు నుంచి మ‌న‌వైపు నుంచి ఆలోచిస్తే క‌స్ట‌మ‌ర్లు ప్ర‌యోజ‌నం పొంద‌డం మాత్రం మంచి విష‌యం. ఈ రోజు క‌థ‌నంలో దేశంలో టాప్ ఈ-కామ‌ర్స్ సంస్థ‌లైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, డొమినోస్, పేటీఎమ్, స్నాప్‌డీల్ సంస్థ‌ల గురించి ఇస్తున్నాం. అబ్బుర‌పరిచే ఆఫ‌ర్ల‌ను గురించి తెలుసుకోవాలంటే చ‌ద‌వండి మ‌రి.
అమెజాన్ ఇండియా
కొన్ని రోజుల ముందే అమెజాన్ సీఈవో ప్ర‌పంచంలోనే రెండో అత్యంత ధ‌న‌వంతుడైన వార్త వ‌చ్చింది. అంటే దాన‌ర్థం కంపెనీ ప‌నితీరు చాలా బాగున్న‌ట్లు. మ‌న దేశంలోకి కొన్ని సంవ‌త్స‌రాల ముందే ప్ర‌వేశించిన‌ప్ప‌టికీ అమెజాన్ ఇండియా దేశంలో ఈ-కామ‌ర్స్‌లో త‌న‌దైన ముద్ర వేసింది.
ముచ్చ‌టైన రాయితీల‌కు, ఆఫ‌ర్ల‌కు అమెజాన్ బాగా పెట్టింది పేరు. ఈ రోజు ఎల‌క్ట్రానిక్స్, ఫ్యాష‌న్ విభాగంలో ఆ కంపెనీ ఇస్తున్న ఆఫ‌ర్లు ఏమిటో తెలుసుకుందాం.
మోటో జీ5 స్మార్ట్‌ఫోన్‌పై ప్రైమ్ క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.1000 క్యాష్‌బ్యాక్‌.
క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసి,ఈఎంఐగా మార్చుకుంటే శామ్‌సంగ్ గెలాక్సీ C7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై రూ.2000 క్యాష్‌బ్యాక్‌. లాజిటెక్ ఉత్ప‌త్తులు, ఇంటెక్స్ ప‌వ‌ర్‌బ్యాంకుల‌పై 50% ఆఫ‌ర్‌. టీసీఎల్ టెలివిజ‌న్ల‌పై రూ. 6000 వ‌ర‌కూ ఆఫ‌ర్ ఉంది.
ఫ్యాష‌న్ విభాగంలో ఎంపిక చేసిన వ‌స్త్ర శ్రేణిపై 40-70% రాయితీలు ఉన్నాయి.

అమెజాన్ ఇండియా

డొమినోస్‌
నోరూరించే పిజ్జాల గురించి ఆలోచించిన‌ప్పుడు మ‌న‌కు వెంట‌నే గుర్తొచ్చేది డొమినోస్‌. రుచిక‌ర‌మైన పిజ్జాల విష‌యంలో భార‌తీయుల‌కు డోమినోస్ హాల్‌మార్క్ అయింది. అంతేకాదు వారు స‌రైన స‌మ‌యానికి డెలివ‌రీ సేవ‌ల‌ను, ఆఫ‌ర్ల‌ను ఇవ్వ‌డంలోనూ పేరుతెచ్చుకున్నారు.
ఆఫ‌ర్ల గురించి మాట్లాడితే అద్బుత‌మైన ఆఫ‌ర్లు డోమినోస్ అందిస్తోంది. రెండు మ‌ధ్య స్థాయి సైజు పిజ్జాలు రూ.295 విలువ క‌లిగిన‌వి ఒక్కొక్క‌టి రూ.199కే ల‌భిస్తున్నాయి. రూ.500 క‌న్నా ఎక్కువ ఆర్డ‌ర్ చేస్తే ఒక రెగ్యుల‌ర్ పిజ్జా ఉచితం(కోడ్‌:MOB20). రూ.300 క‌నీస ఆర్డ‌ర్‌పై గార్లిక్ బ్రెడ్ ఫ్రీ. అంతే కాకుండా రూ. 400 పైబ‌డిన ఆర్డ‌ర్‌పై 20% ఆఫ‌ర్‌(కోడ్‌:0L020)

అమెజాన్ ఇండియా

పేటీఎమ్‌
ఆన్‌లైన్ రీచార్జీ సేవ‌లు, డిజిట‌ల్ వ్యాలెట్ విష‌యంలోనూ పేటీఎమ్ ఒక కొత్త ఒర‌వ‌డి సృష్టించింది. కేంద్ర ప్ర‌భుత్వ క‌ల అయిన న‌గ‌దు ర‌హిత ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఇతోధికంగా పేటీఎమ్ దోహ‌ద‌పడుతోంది. మొద‌ట్లో మొద‌లైన రీచార్జీల‌తో మొద‌లైన ఈ వెబ్‌సైట్ ఒక పెద్ద ఈ-కామ‌ర్స్ సంస్థ‌గా మార్పు చెందింది. క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ఇది ఉత్త‌మ‌మైన డీల్స్‌ను అందిస్తోంది. త‌ద్వారా పేటీఎమ్ సైతం వేగంగా వృద్ది చెందుతోంది.
ఎంపిక చేసిన జీన్స్‌పై పేటీఎమ్ 30% - 70% ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. "FLYDAY" ప్రోమోకోడ్ ద్వారా విమాన టిక్కెట్ల బుకింగ్‌ల‌పై ఫ్లాట్ రూ.750 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. కనీసం రెండు టికెట్లు కొనుగోలు చేయాల‌నే ష‌ర‌తుతో రెండు Fast and Furious 8 సినిమా టిక్కెట్లు కొంటే రూ.100 క్యాష్‌బ్యాక్‌(కోడ్‌:FAST100). ఎంపిక చేసి హ్యాండ్‌బ్యాగులు, ల‌గేజీ బ్యాగుల‌పై 50% క్యాష్‌బ్యాక్‌. ఎంపిక చేసిన స్పోర్ట్స్ షూపై ఫ్లాట్ 50% క్యాష్‌బ్యాక్. పేటీఎమ్ ద్వారా రీచార్జీ చేసుకుని బిల్లు చెల్లింపును వ్యాలెట్ నుంచి చేస్తే ఫ్లైట్ బుకింగ్‌ల‌పై రూ. 500 క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్‌ను ఈ ఈ-కామ‌ర్స్ సంస్థ అంది్స్తోంది.

అమెజాన్ ఇండియా

ఫ్లిప్‌కార్ట్
దేశ ఈ-కామ‌ర్స్ ప‌రిశ్ర‌మ‌లో ఫ్లిప్‌కార్ట్‌ను గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. దేశంలో ఈ-కామ‌ర్స్ రంగంలో చాలా త్వ‌ర‌గా అడుగుపెట్టింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్త నెట్‌వ‌ర్క్‌ను ఏర్పాటు చేసుకోగ‌లిగింది. వినియోగదార్లకు ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆఫ‌ర్లు, రాయితీలు అందించ‌డంతో పాటు మెరుగైన డెలివ‌రీ సేవ‌ల‌ను అందించ‌డంతోనే ఇది సాధ్య‌మైంది.
ప్ర‌స్తుతం ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఆఫ‌ర్ల‌ను చూద్దాం. ఐపీఎల్ సీజ‌న్‌తో పాటుగానే ఫ్లిప్‌కార్ట్ TV Days offerను తీసుకొచ్చింది. ఎంపిక చేసిన టీవీల‌ను కొంటే అద్బుత‌మైన రాయితీల‌ను అందిస్తున్నారు. అంతే కాకుండా సుల‌భ ఈఎంఐలు, ఎక్స్చేంజీ ఆఫ‌ర్లు కూడా ఉన్నాయి. దీంతో పాటు శ్యామ్‌సంగ్ మొబైల్ ఫెస్ట్ మొద‌లైంది. ఎంపిక చేసిన శ్యామ్‌సంగ్ ఫోన్ల‌పై ఫ్లిప్‌కార్ట్ అబ్బుర‌ప‌రిచే ఆఫ‌ర్ల‌ను ఇస్తోంది. ఎక్స్చేంజీ ఆఫ‌ర్ల‌తో పాటు ఎంపిక చేసిన ఫోన్ల‌పై అద‌న‌పు వ‌డ్డీ లేని ఈఎంఐ స‌దుపాయాల‌ను అందిస్తున్నారు. కేవ‌లం ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉండేలా మైక్రోమ్యాక్స్ ఎవోక్ ప‌వర్‌(రూ.6999), మైక్రోమ్యాక్స్ ఎవోక్ నోట్(రూ.9499) ఫోన్ల‌ను స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు అందిస్తున్నారు.

అమెజాన్ ఇండియా

స్నాప్‌డీల్‌
స్నాప్‌డీల్ దేశీయ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జాల్లో మూడో అతిపెద్ద కంపెనీ. ఉత్తేజ‌క‌ర‌మైన డీల్స్‌ను అందించ‌డంలో స్నాప్‌డీల్ సైతం ముందు వ‌రుస‌లో ఉంటుంది.
స్నాప్‌డీల్ ఆఫ‌ర్లివి: పూమా, స్పార్క్స్ వంటి బ్రాండ్ల‌లో మెన్ స్పోర్ట్స్ షూల‌పై ఆఫ‌ర్లు ఇవ్వ‌డం ద్వారా రూ. 1899లోపే మంచి షూల‌ను స్నాప్‌డీల్ అందిస్తోంది. కేవ‌లం స్నాప్‌డీల్ ద్వారానే అమ్ముడ‌వుతున్న శ్యామ్‌సంగ్ గెలాక్సీ జే3 ఫోన్‌ను రాయితీ ద్వారా రూ.7490 కే అమ్ముతున్నారు. కొన్ని ఎంపిక చేసిన బ్రాండ్ల‌కు చెందిన‌ స్పోర్ట్స్ యాక్సెస‌రీస్‌పై 70% వ‌ర‌కూ రాయితీ, పిల్ల‌ల బొమ్మ‌లైన‌ రైడ్ ఆన్, స్కూట‌ర్ల‌పై 60% వ‌ర‌కూ రాయితీ. వీటితో పాటు హెచ్‌డీఎప్‌సీ క్రెడిట్‌కార్డు దారుల‌కు ప్ర‌త్యేక ఆఫ‌ర్‌. క్రెడిట్ కార్డు ఉపయోగించి స్నాప్‌డీల్ వెబ్‌సైట్లో చెల్లింపులు చేయడం ద్వారా 5రెట్లు ఎక్కువ రివార్డ్ పాయింట్లు గెలుచుకోవ‌చ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+