For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు

ఆర్‌బీఐ ద్వైమాసిక పాలసీ సమీక్ష నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 47 పాయింట్లు(0.16%) క్షీణించి 29,927 వద్ద నిలవగా.. నిఫ్టీ నామమాత్రంగా 3 పాయింట్లు తగ్గి 9,262 వద్ద స్థ

|

ఆర్‌బీఐ ద్వైమాసిక పాలసీ సమీక్ష నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 47 పాయింట్లు(0.16%) క్షీణించి 29,927 వద్ద నిలవగా.. నిఫ్టీ నామమాత్రంగా 3 పాయింట్లు తగ్గి 9,262 వద్ద స్థిరపడింది. తొలుత ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతల కారణంగా సెన్సెక్స్‌ 29,817 వద్ద కనిష్టాన్ని తాకగా.. నిఫ్టీ 9268-9218 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.

 స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు

మిడ్‌ సెషన్‌లో పాలసీ రేట్ల‌ను యథాతథంగా ఉంచేందుకు కట్టుబడుతున్నట్లు రిజ‌ర్వ్ బ్యాంకు ప్రకటించడంతో మార్కెట్లు కోలుకోవడం ద్వారా కొంతమేర నష్టాలను తగ్గించుకున్నాయి. వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును యథాతథంగా 6.25 శాతం వద్దే కొనసాగించేందుకు ఆర్‌బీఐ గవర్నర్‌ పటేల్‌ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది.
దేశీయ స్టాక్‌ ఎక్సేంజ్‌లో టాటాస్టీల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బజాజ్‌ ఆటో, అంబుజా సిమెంట్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభపడగా.. హిందాల్కో, ఐటీసీ, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోల్‌ ఇండియా షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

English summary

స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు | markets ended with flat losses as rates keep unchanged by RBI

BSE Sensex closed lower by 47 points, or 0.16%, to 29,927, while the Nifty 50 fell 3 points, or 0.03%, to 9,262.The Reserve Bank of India kept its repo rate at 6.25% for a third consecutive policy meeting to guard against rise in inflation and an uncertain global economic environment.
Story first published: Thursday, April 6, 2017, 16:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X