స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అదుర్స్
స్థిరాస్తి, వినియోగదారు వస్తు రంగాలు రాణించడంతో ఈ రోజు దేశీయ షేర్లు రికార్డు లాభాల్లో పయనించాయి. మరో వైపు మదుపరులంతా మానిటరీ పాలసీ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వేచి చూస్తున్నారు
స్థిరాస్తి, వినియోగదారు వస్తు రంగాలు రాణించడంతో ఈ రోజు దేశీయ షేర్లు రికార్డు లాభాల్లో పయనించాయి. మరో వైపు మదుపరులంతా మానిటరీ పాలసీ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వేచి చూస్తున్నారు. దాదాపు రెండేళ్ల తరువాత మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 30,000 పాయింట్ల మైలురాయిని అందుకుంది. ఈ కాలంలో సుమారు 600 స్టాక్స్ ధరలు రెట్టింపయ్యాయి. 2015లో తొలిసారి 30,000 పాయింట్లకు చేరిన సెన్సెక్స్ తిరిగి నేటి ట్రేడింగ్ ప్రారంభంలోనే 30,007ను తాకింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో చివరి సెషన్‌లోనూ ఈ మార్క్‌ను అందుకుంది. అదే ఊపులో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ కొత్త గరిష్టం 9,274ను తాకింది. కాగా.. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 64 పాయింట్లు పెరిగి 29,974 వద్ద నిలవగా.. నిఫ్టీ 27 పాయింట్లు బలపడి 9,265 వద్ద స్థిరపడింది.

రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(4.08%), వినియోగదారు వస్తువులు(2.41%), మూలధన వస్తువులు(1.53%), మౌలిక రంగం(1.22 %) లాభపడ్డాయి. మరో వైపు అమెరికా హెచ్-1 బీ వీసా భయాలతో ఐటీ రంగం 0.79 శాతం నష్టపోయింది. టెక్నాలజీ ( 0.21%), ఎఫ్ఎంసీజీ(0.1%) స్వల్పంగా క్షీణించాయి.
సెన్సెక్స్‌లో బాగా లాభపడిన వాటిలో అదానీ పోర్ట్స్(4.5%), మారుతి(4.4%), రిలయన్స్(3.19%), ఎల్ అండ్ టీ (2.18%), హెచ్‌యూఎల్(1.82%)ఉండగా; నష్టపోయిన వాటిలో హెచ్‌డీఎఫ్‌సీ(2.78%), కోల్ ఇండియా(1.69%), ఇన్ఫోసిస్(1.39%), ఏసియన్ పెయింట్స్(1.36%), ఐటీసీ(0.98%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications