డెబిట్,క్రెడిట్ కార్డులు మాయమవుతాయా?
మొత్తం స్వైపింగ్ మెషీన్ల సంఖ్య 15 లక్షలను దాటలేదు. నిరక్షరాస్యుల్లో చాలా మందికి ఏటీఎమ్ కార్డులు వాడటమే తెలీదు. అలాంటిది అమితాబ్ కాంత్ చెబుతున్నట్లు పూర్తి కార్డు రహిత చెల్లింపులు సాధ్యమవుత
మన దేశం గత కొద్ది నెలల నుంచి డిజిటల్ కరెన్సీ వైపు అడుగులు వేస్తోంది. పెద్ద నోట్ల రద్దు(మార్పిడి) తర్వాత కార్డులతో పాటు డిజిటల్ వ్యాలెట్లను వాడేందుకు జనం అలవాటు పడుతున్నారు. అయితే.. ఇంకా కార్డుల వాడకమే మన దగ్గర ఇంకా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. తగినంత డిజిటల్ సాంకేతికత విస్తరించకపోవడంతో పాటు అవసరమైనన్ని కార్డు స్వైపింగ్ మెషీన్లు, కార్డు చార్జీల భారంతో ప్రజలు మొక్కుబడిగానే కార్డు చెల్లింపులను చేస్తున్నారు.

క్రెడిట్ కార్డులు 3 శాతం మంది జనాల దగ్గరే ఉండగా.. మొత్తం వినియోగంలో కార్డుల ద్వారా ఖర్చు చేసే మొత్తం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు కార్డుల మాయం కానున్నాయంటూ నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ చెప్పడం చర్చనీయాంశమైంది. బిల్లు చెల్లింపులకు పనికొచ్చే వ్యాలెట్లు

"మన దేశంలో బ్యాంకుకు వెళ్లి ఖాతాదారులు కార్యకలాపాలు చేసే అవసాన దశలో ఉంది. టెక్నాలజీ ఆధారంగా బ్యాంకింగ్ ఊపందుకోనుండగా.. మరో మూడు నాలుగేళ్లలో డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరగనున్నాయి. మొబైల్ వ్యాలెట్స్స, బయోమెట్రిక్ విధానాల్లోనే చెల్లింపులు సాగే రోజులు రానున్నాయి. ఆ సమయానికి డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు కూడా మాయం అయిపోవడం ఖాయం" అన్నారు అమితాబ్ కాంత్.

ఒక పక్క ఇంటర్నెట్ విస్తరణ దేశ సగటు 27% మాత్రమే ఉండగా కేవలం దక్షిణ భారతదేశం మాత్రమే ఇంటర్నెట్ వేగంలో ముందంజలో ఉంది. అంతే కాకుండా మొత్తం స్వైపింగ్ మెషీన్ల సంఖ్య 15 లక్షలను దాటలేదు. నిరక్షరాస్యుల్లో చాలా మందికి ఏటీఎమ్ కార్డులు వాడటమే తెలీదు. అలాంటిది అమితాబ్ కాంత్ చెబుతున్నట్లు పూర్తి కార్డు రహిత చెల్లింపులు సాధ్యమవుతాయో లేదో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications