11 శాతం పడిపోయిన బజాజ్ వాహన అమ్మకాలు
మార్చి,2016లో ఉన్న 3,05,800 నుంచి 10% తగ్గుదలతో ఈ ఏడాది మార్చి నెలలో 2,72,197 వాహన అమ్మకాలు జరిపినట్లు బజాజ్ ఆటో ఈ రోజు వెల్లడించింది. దేశీయంగా జరిపిన అమ్మకాలు 1,69,279గా ఉండగా(గతేడాది
మార్చి,2016లో ఉన్న 3,05,800 నుంచి 10% తగ్గుదలతో ఈ ఏడాది మార్చి నెలలో 2,72,197 వాహన అమ్మకాలు జరిపినట్లు బజాజ్ ఆటో ఈ రోజు వెల్లడించింది. దేశీయంగా జరిపిన అమ్మకాలు 1,69,279గా ఉండగా(గతేడాది ఇదే కాలంలో 2,04,281) తగ్గుదల 17.13% ఉన్నట్లు తెలిపింది.

మోటార్ సైకిళ్ల అమ్మకాలు 2,64,249 నుంచి 2,44,235కి(7.57%) తగ్గినట్లు వివరించింది. వీటిలో దేశీయ ద్విచక్ర వాహన అమ్మకాలు గతేడాది మార్చిలో 176788గా ఉండగా ఇప్పుడు 14.33% తగ్గి 1,51,449 పడిపోయినట్లు తెలిపింది. వాణిజ్య వాహన విభాగం విషయానికొస్తే మార్చి,2017లో 27,962 వాహనాలు అమ్ముడయినట్లు(2016,మార్చి-41551) ఇందులో 32.70% తగ్గుదల సంభవించినట్లు పేర్కొంది. మొత్తం ఎగుమతులు 1,01,519 నుంచి 1,02,918కి (1.37%) తగ్గినట్లు కంపెనీ ప్రకటించింది.


Click it and Unblock the Notifications