స్వ‌ల్ప‌ న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు, ఎక్కువ న‌ష్టాల్లో బ్యాంకింగ్ రంగం

మూడు రోజులపాటు మార్కెట్లు లాభాల్లో కొన‌సాగిన త‌ర్వాత శ‌నివారం ట్రేడర్లు లాభాల కోసం కొంతమేర అమ్మకాలకు ప్రాధాన్యమివ్వ‌డంతో దేశీయ మార్కెట్లు న‌ష్టాల‌కు గుర‌య్యాయి. మరోపక్క ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి

మూడు రోజులపాటు మార్కెట్లు లాభాల్లో కొన‌సాగిన త‌ర్వాత శ‌నివారం ట్రేడర్లు లాభాల కోసం కొంతమేర అమ్మకాలకు ప్రాధాన్యమివ్వ‌డంతో దేశీయ మార్కెట్లు న‌ష్టాల‌కు గుర‌య్యాయి. మరోపక్క ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఇంట్రాడేలో నిఫ్టీ, సెన్సెక్స్‌ గత గరిష్ట ముగింపు రికార్డులను అందుకున్నాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 27 పాయింట్లు తగ్గి 29,620 వద్ద నిలవగా.. నిఫ్టీ యథాతథంగా 9,174 వద్దే స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 29,688-29,553 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 9,191 వద్ద గరిష్టాన్నీ, 9,152 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది.ఈ నెల‌లో ఎన్ఎస్ఈ సూచీ 3.1% పైకి ఎగ‌బాకింది. యూపీలో మోదీ ప్ర‌చారం విజ‌యవంతం అవ్వ‌డంతో ఒక ద‌శ‌లో మార్చి17న రికార్డు స్థాయి 9218 వ‌ర‌కూ వెళ్లింది.

 స్వ‌ల్ప‌ న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు, ఎక్కువ న‌ష్టాల్లో బ్యాంకింగ్ రంగం

బీఎస్ఈలో రంగాల వారీగా చేస్తే చ‌మురు,స‌హ‌జ వాయు(1.85%), లోహ‌(1.13%), క్యాపిట‌ల్ గూడ్స్‌(0.98%), క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌(1.05%) లాభాల్లో ప‌య‌నించ‌గా; బ్యాంకింగ్‌(0.73%), ఎఫ్ఎంసీజీ(0.36%), టెక్నాల‌జీ(0.29%), ఐటీ(0.31%) న‌ష్టాల దిశ‌గా క‌ద‌లాడాయి.
సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో రిలయన్స్ (3.93%), ఎన్టిపిసి (1.59%), ఎల్ అండ్ టి (1.28%), మారుతి (1.18), టాటా స్టీల్ (0.94 శాతం), కోల్ ఇండియా ( 0.91%), ఎస్‌బీఐ (0.90%) ఉండ‌గా; యాక్సిస్ బ్యాంక్ (-1.65%), ఐసిఐసిఐ బ్యాంక్ (-1.53%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (-1.47%), హెచ్డిఎఫ్సి (-1.37%), హెచ్‌యూఎల్ (-1.03%), సిప్లా (-0.90%), టిసిఎస్ (-0.85% ), ఐటిసి (-0.76%) న‌ష్టాల‌కు గుర‌యిన వాటిలో ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+