811 పేరుతో సరికొత్త డిజిటల్ సేవల దిశగాకొటక్ మహీంద్రా
కొటక్ మహీంద్రా బ్యాంకు ఖాతాదారులకు సరికొత్త సేవను అందించనున్నట్లు ప్రకటించింది. జీరో బ్యాలెన్స్ ,సేవింగ్స్ ఖాతాతో పాటు అన్ని డిజిటల్ లావాదేవీలను కూడా ఉచితంగా పొందవచ్చు. ఇంకా వినియోగదారులు తమ ఖ
కొటక్ మహీంద్రా బ్యాంకు ఖాతాదారులకు సరికొత్త సేవను అందించనున్నట్లు ప్రకటించింది. జీరో బ్యాలెన్స్ ,సేవింగ్స్ ఖాతాతో పాటు అన్ని డిజిటల్ లావాదేవీలను కూడా ఉచితంగా పొందవచ్చు. ఇంకా వినియోగదారులు తమ ఖాతాల్లోని నిల్వపై 6% వడ్డీని సంపాదిస్తారు. 811 ప్లాన్ తో ఈ సరికొత్త పథకాన్ని బుధవారం నాడు ప్రకటించింది. 811 ఖాతా తెరిచేందుకు, నిర్వహించుకునేందుకు ఆధార్, పాన్ నెంబర్ ఉంటే చాలని తెలిపింది. డిజిటల్ లావాదేవాలను ప్రోత్సహించే దిశగా ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చినట్లు బ్యాంక్ వెల్లడించింది. మొబైల్ పోన్ల ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు రాబోయే 18 నెలలలో 1 కోటి 60 లక్షల వినియోగదారులను సాధించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టుగా ఆ బ్యాంకు ప్రకటించింది.

కొటక్ మొబైల్ బ్యాంకింగ్ ఉన్నవారు ఎప్పుడైనా ఎక్కడ ఉన్నా డిజిటల్ ఖాతాను తెరవచ్చు. ఈ సదుపాయం 700 ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్‌ఛైర్మన్, ఎండీ ఉదయ్ కొటక్ మాట్లాడుతూ "కొటక్ బ్యాంక్ కోసం 1985లో మేము రూ.1 లక్ష పెట్టుబడి పెట్టాం. ఈ రోజు అది రూ.1400 కోట్ల విలువకు పెరిగింది. 32 ఏళ్లలో వార్షికంగా 40% కాంపౌండ్ వృద్దిని సాధించాం. మేము ఎప్పుడూ మా వాటాదారులకు విలువను జోడించేందుకే ప్రయత్నిస్తున్నాం. ఆర్థిక సేవల్లో సాధారణ సేవలతో పాటు సరికొత్త డిజిటల్ సేవల దిశగా మా సంస్థ బహుళ వ్యూహాలను రచిస్తోంది." ప్రస్తుతం 811 గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications