ఆరోగ్య బీమా తీసుకునే మహిళ‌ల సంఖ్య పెరుగుతోంది: స‌ర్వే

మ‌హిళ‌ల్లో ఐదు ప్ర‌ధాన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు సంబంధించి క్లెయింలు ఏటేటా త‌గ్గుతున్న‌ట్లు తెలిసింది. 29% త‌మ‌కు తాముగా ఆరోగ్య బీమాను కొనడాన్ని చూస్తే, ఆరోగ్య బీమా విష‌యంలో మ‌హిళ‌ల వైఖ‌రి మారుతున్న‌ట్లు

ఆరోగ్యం, శారీర‌క దృఢ‌త్వం వంటి అంశాల గురించి 95% మ‌హిళ‌ల‌కు తెలిసిన‌ప్ప‌టికీ; ఆరోగ్యం బాగోలేన‌ప్పుడు చికిత్స‌కు వెళ్లే మ‌హిళ‌ల సంఖ్య 74శాతంగా మాత్ర‌మే ఉంటోందని ఒక స‌ర్వే వెల్ల‌డించింది.

 మ‌హిళ‌ల ఆరోగ్యం- బీమా
ఐసీఐసీఐ లాంబ‌ర్డ్ మ‌హిళ‌ల ఆరోగ్యం- బీమా గురించి ఒక స‌ర్వేను నిర్వ‌హించింది. అందులో ప‌లు ర‌కాల విష‌యాల‌ను వెల్ల‌డించింది. దీని ప్ర‌కారం స‌ర్వేలో పాల్గొన్న మ‌హిళ‌ల్లో 47% మందికి ఆరోగ్య బీమా ఉన్న‌ట్లు, 65 శాతం మంది త‌మ‌కు పూర్తిగా బీమా గురించి తెలిసిన‌ట్లు చెప్పారు. క్లెయిం చేయ‌డం గురించి తెలుస‌ని 77% మంది ధీమా వ్య‌క్తం చేశారు. ఈ స‌ర్వేను 1500 మంది గృహిణులు, స్వ‌యం ఉపాధి వ‌ర్గాల వారు, ఉద్యోగం చేసే మ‌హిళ‌ల‌పై నిర్వ‌హించారు. 22 నుంచి 55 ఏళ్ల వ‌య‌సు మ‌ధ్య క‌లవారిని ఇందుకోసం ఎంచుకున్నారు. మెట్రో న‌గ‌రాల‌తో పాటు బెంగుళూరు, హైద‌రాబాద్‌, చంఢీఘ‌డ్‌, ల‌క్నో న‌గ‌రాల్లో ఈ స‌ర్వే జ‌రిగింది.
మ‌హిళ‌ల్లో ఐదు ప్ర‌ధాన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు సంబంధించి క్లెయింలు ఏటేటా త‌గ్గుతున్న‌ట్లు తెలిసింది. 29% త‌మ‌కు తాముగా ఆరోగ్య బీమాను కొనడాన్ని చూస్తే, ఆరోగ్య బీమా విష‌యంలో మ‌హిళ‌ల వైఖ‌రి మారుతున్న‌ట్లు సర్వే విశ్లేషించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+