మదుపరి మోము మెరిసింది: నిఫ్టీ 9100 పైకి
దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. మునుపటి నష్టాలను మరిపించేలా దేశీయ షేర్లు రాణించాయి. దేశీయ సెంటిమెంటు బలపడటంతో పాటు విదేశీ నిధుల రాకతో దేశీయ సూచీలు లాభాల బాట పట్టాయి. దీంతో సెన
దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. మునుపటి నష్టాలను మరిపించేలా దేశీయ షేర్లు రాణించాయి. దేశీయ సెంటిమెంటు బలపడటంతో పాటు విదేశీ నిధుల రాకతో దేశీయ సూచీలు లాభాల బాట పట్టాయి. దీంతో సెన్సెక్స్ 172.37 పాయింట్లు(0.59%) లాభపడి 29,409.52 వద్ద ముగియగా; నిఫ్టీ 55.6 పాయింట్లు(0.61%) పైకి ఎగబాకి 9100.80 వద్ద స్థిరపడింది.
చమురు,సహజవాయు; స‌్థిరాస్తి రంగాలు తప్ప బీఎస్ఈ సూచీలో అన్ని రంగాలు సానుకూలంగా కదలాడాయి. బ్యాంకింగ్ అత్యధికంగా 0.78% లాభపడగా, వాహన రంగం(0.77%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.76%), విద్యుత్-పవర్(0.75%) తర్వాతి స్థానాలలో ఉన్నాయి. నష్టపోయిన వాటిలో స్థిరాస్తి రంగం(0.35%), చమురు, సహజవాయు రంగం(0.25%) ఉన్నాయి.

బీఎస్ఈలో లాభపడిన, నష్టపోయిన సంస్థలు ఈ విధంగా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్(3.23%), హెచ్‌డీఎఫ్‌సీ(1.97%), టాటా మోటార్స్(1.48%), ఏసియన్ పెయింట్స్(1.32%), ఐసీఐసీఐ బ్యాంకు(1.26%) దూసుకెళ్లగా; ఓఎన్‌జీసీ(1.08%), ఐటీసీ(0.5%), లుపిన్(0.45%), రిలయన్స్(0.41%), కోల్ ఇండియా(0.33%)నీరసించాయి.


Click it and Unblock the Notifications