రైల్వే టికెట్లపై రాయితీలు పొందడానికి సీనియర్ సిటిజన్లకు ఆధార్ నంబరు తప్పనిసరి కాదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు లోక్సభలో ఈ మేరకు వివరణ ఇచ్చారు. అయితే వృద్ధుల వివరాలతో కే
రైల్వే టికెట్లపై రాయితీలు పొందడానికి సీనియర్ సిటిజన్లకు ఆధార్ నంబరు తప్పనిసరి కాదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు లోక్సభలో ఈ మేరకు వివరణ ఇచ్చారు. అయితే వృద్ధుల వివరాలతో కేంద్రం ఒక డేటాబేస్ను రూపొందిస్తోందని ఆయన వెల్లడించారు.

వయో వృద్ధులు రైల్వే టికెట్లపై రాయితీ పొందడానికి ఏప్రిల్ 1 నుంచి ఆధార్ నంబరును తప్పనిసరి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జనవరి 1నుంచి సీనియర్ సిటిజన్ల ఆధార్ వివరాలను ముందస్తుగా వెరిఫై చేయడం ద్వారా వారికి సంబంధించిన ఒక సమాచార నిధి(డేటా బేస్)ని రూపొందిస్తున్నామని సురేశ్ ప్రభు చెప్పారు. అందువల్ల రైల్వే టికెట్లపై వయో వృద్ధులు రాయితీ పొందడానికి ఆధార్ నంబరు తప్పనిసరి కాదని ఆయన చెప్పారు. వయోవృద్ధుల రాయితీలు దుర్వినియోగం కాకుండా చూడడం కోసం, అలాగే నిర్ణయాలు తీసుకోవడం కోసం సమాచార నిధిని ఉపయోగించుకుంటామని సురేశ్ ప్రభు చెప్పారు. కాగా, నగదు రహిత వ్యవస్థను ప్రోత్సహించడం కోసం రైల్వే శాఖ అనేక చర్యలు తీసుకొందని మంత్రి చెప్పారు. మా అంతిమ లక్ష్యం నగదు రహిత టికెట్ బుకింగ్ కాగా తక్షణ ప్రాధాన్యత నగదు లావాదేవీలను తక్కువ చేయడమే అని ఆయన తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications