నగదు లావాదేవీల పరిమితి మూడు నుంచి రెండు లక్షలకు కుదించాలని ప్రతిపాదించటం ద్వారా ఎన్డీయే ప్రభుత్వం సంచలనం సృష్టించింది. నగదు లావాదేవీలను మూడు లక్షలకు పరిమితం చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ
నగదు లావాదేవీల పరిమితి మూడు నుంచి రెండు లక్షలకు కుదించాలని ప్రతిపాదించటం ద్వారా ఎన్డీయే ప్రభుత్వం సంచలనం సృష్టించింది. నగదు లావాదేవీలను మూడు లక్షలకు పరిమితం చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో ప్రతిపాదించటం తెలిసిందే. అయితే దీన్ని రెండు లక్షలకు పరిమితం చేస్తూ కేంద్రం మంగళవారం ఆర్థిక బిల్లుకు సవరణ ప్రతిపాదించింది. దీనికి సంబంధించి మరిన్ని అసక్తి కర అంశాలు తెలుసుకుందాం.

ఏప్రిల్ 1 నుంచి రూ.2 లక్షలే...
నగదు పరిమితి కుదింపు అంశం ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తుంది. రెండు లక్షలకంటే ఎక్కువ నగదు ఆమోదించే వారికి అంతేస్థాయి నగదు జరిమాన విధిస్తారు. అక్రమ లావాదేవీలు అదుపు చేయటంతోపాటు అవినీతిని అరికట్టేందుకే నగదు లావాదేవీలను రెండు లక్షలకు పరిమితం చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.

బడ్జెట్లో అలా... ఇప్పుడిలా...
నగదు లావాదేవీలను మూడు లక్షలకు పరిమితం చేస్తామని బడ్జెట్‌లో చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు మనసు మార్చుకుని కుదింపుప్రతిపాదన చేస్తుందనేది వెల్లడించలేదు. నగదు లావాదేవీల నియంత్రణ కోసమే ఈ పరిమితి విధిస్తున్నట్టు రెవెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్ ఆధియా చెబుతున్నారు. నగదు లావాదేవీలపై పరిమితి విధించాలని నల్లధన నియంత్రణపై సిఫార్సులు చేసేందుకు నియమించిన సిట్ సూచించిన సంగతి తెలిసిందే.

పార్టీల విరాళాల విషయంలో
బడ్జెట్ సందర్భంగా రాజకీయ పార్టీల విరాళాలకు సంబంధించిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. ట్యాక్స్ ఇన్సెంటివ్‌లను నాలుగు విధాలుగా జైట్లీ ప్రతిపాదించారు. చెక్కుల ద్వారా చెల్లింపులు, రాజకీయ పార్టీలకు నగదు రూ.20 వేలు కాకుండా రూ. 2 వేల వరకూ మాత్రమే నగదు చెల్లింపులు జరిగేలా ప్రకటించారు. ఇంకా మూడోది చెల్లింపులన్నీ ఆన్‌లైన్లో జరిగేలా, అంతే కాకుండా ఎలక్ట్రోరల్ బాండ్లను సైతం ప్రతిపాదించారు.

అభ్యంతర పెడుతున్న ప్రతిపక్షాలు
ఆర్థిక బిల్లుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని టీఎంసీ, బీజేడీ, ఆర్‌ఎస్పీ తదిపర పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. స్పీకర్ సుమిత్రా మహాజాన్ ప్రతిపక్షాల విమర్శలను కొట్టిపారేస్తూ ప్రభుత్వ సవరణలన్నీ మనీ బిల్లు పరిధిలోకి వస్తాయి కాబట్టి వాటన్నింటినీ ఆర్థిక బిల్లులో చేర్చడం ఎలాంటి తప్పులేదని స్పష్టం చేశారు. అంతేకాకుంఆ ఆర్థిక బిల్లుకు సవరణలు ప్రతిపాదించే అధికారి ప్రభుత్వానికి ఉంటుందని అరుణ్ జైట్లీ ప్రభుత్వ చర్యలను సమర్థించుకున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications