మూడో రోజు న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు: సెన్సెక్స్ 318 పాయింట్లు డౌన్‌

సెన్సెక్స్ 318 పాయింట్లు(1.08%) న‌ష్ట‌పోయి 29168 వ‌ద్ద ముగియ‌గా; నిప్టీ 91 పాయింట్లు(దాదాపు 1%) క్షీణించి 9030 వ‌ద్ద స్థిర‌ప‌డింది. లుపిన్‌, విప్రో, సిప్లా, డాక్ట‌ర్ రెడ్డీస్‌, హెచ్‌యూఎల్ లాభ‌ప‌డిన వా

అంత‌ర్జాతీయంగా బ‌ల‌హీన‌మైన సంకేతాల‌తో ఈ వారంలో వ‌రుస‌గా మూడో రోజూ మార్కెట్లు న‌ష్టాల్లో ముగిశాయి. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఆర్థిక విధానాల‌పై అనుమానాల‌తో వాల్ స్ట్రీట్లో కొన‌సాగిన భ‌యాందోళ‌న‌లు ఈ రోజు ప్రాంతీయ మార్కెట్ల‌పై ప‌డ్డాయి. అదే కోవ‌లో దేశీయ మార్కెట్లు న‌ష్టాల్లో కొన‌సాగాయి. ఉద‌యం న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన సూచీలు రోజంతా అలానే కొన‌సాగాయి. సెన్సెక్స్ 318 పాయింట్లు(1.08%) న‌ష్ట‌పోయి 29168 వ‌ద్ద ముగియ‌గా; నిప్టీ 91 పాయింట్లు(దాదాపు 1%) క్షీణించి 9030 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

sensex ended with 318 points loss

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌(1.94%), వాహ‌న రంగం(1.58%), ఎఫ్ఎంసీజీ(1.51%), లోహ రంగం(1.28%) న‌ష్ట‌పోయాయి. బాగా న‌ష్ట‌పోయిన వాటిలో భార‌తీ ఎయిర్‌టెల్(3.18%), ఐటీసీ(3.01%), టాటా మోటార్స్‌(2.74%), ఐసీఐసీఐ బ్యాంక్(2.55%), బ‌జాజ్ ఆటో(1.91%) ఉండ‌గా; మ‌రో వైపు లుపిన్‌, విప్రో, సిప్లా, డాక్ట‌ర్ రెడ్డీస్‌, హెచ్‌యూఎల్ లాభ‌ప‌డిన వాటిలో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+