జియోకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ సైతం ఆఫర్లు
జియోకు పోటీగా మంగళవారం రూ.339తో ప్రత్యేకంగా ఓ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు రోజుకు 2జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు.ఒకనెలలో వినియోగదారులు 30 జీబీ డేటాను
ఆఫర్ల కిక్కుతో వినియోగదార్లను ముంచెత్తుతున్నరిలయన్స్ జియోకు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం సంస్థలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. రకరకాల ప్లాన్లతో ముందుకొస్తున్న నెట్‌వర్క్ కంపెనీల జాబితాలో ప్రస్తుతం ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సైతం చేరింది. జియోకు పోటీగా మంగళవారం రూ.339తో ప్రత్యేకంగా ఓ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు రోజుకు 2జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు.

''జియో, ఇతర ప్రైవేటు కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు అత్యంత చవకైన ప్లాన్‌ను తీసుకొస్తున్నాం. రూ.339 తో తీసుకొచ్చిన ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు రోజుకు 2జీబీ డేటాను పొందవచ్చు'' అని బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ సంజీవ్ త్యాగి తెలిపారు. ''ఒకనెలలో వినియోగదారులు 30 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు, రోజుకు ఉచితంగా 25 కాల్స్ చేసుకోవచ్చు. 25 నిమిషాల గడువు పూర్తయిన తర్వాత నిమిషానికి 25 పైసల చొప్పున చార్జీ విధిస్తాం'' అని ఆయన వివరించారు. ఏప్రిల్ 1 నుంచి ఈ ప్లాన్ అందుబాటులోకి వస్తుందని త్యాగి వివరించారు. ప్రయివేటు రంగంలోని టెలికాం సంస్థలు సరికొత్త ఆఫర్లతో ఎప్పటికప్పుడు వినియోగదార్లను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ సైతం మంచి ఆఫర్ ఇవ్వడం కస్టమర్లను సంతోషానికి గురిచేస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications