ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ స్నాప్‌డీల్ తన డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫ్రీఛార్జ్‌కు సీఈవోగా జాసన్ కొఠారిని నియమించింది. దీంతో పాటు కొఠారి స్నాప్‌డీల్‌లోని చీఫ్ స్ట్రాటజీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర
ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ స్నాప్‌డీల్ తన డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫ్రీఛార్జ్‌కు సీఈవోగా జాసన్ కొఠారిని నియమించింది. దీంతో పాటు కొఠారి స్నాప్‌డీల్‌లోని చీఫ్ స్ట్రాటజీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా కొనసాగనున్నారు. అంతేగాక ఫ్రీఛార్జ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌లలో ఒకరుగా వ్యవహరించనున్నారు. ఇంతకుముందు బాధ్యతలు నిర్వర్తించిన గోవింద రాజన్ స్థానంలో జాసన్ కొత్తగా బాధ్యతలు చేపట్టనున్నారు.
2015 ఏప్రిల్‌లో ఫ్రీఛార్జ్‌ను స్నాప్‌డీల్ కొనుగోలు చేసింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఫ్రీఛార్జ్‌ను కూడా విస్తరించేందుకు స్నాప్‌డీల్ స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళుతోంది. 2025 నాటికి కేవలం డిజిటల్ చెల్లింపుల్లోనే భారత్ 1 ట్రిలియన్ లావాదేవీల స్థాయికి ఎదగనుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ చెల్లింపుల్లో తన స్థానాన్ని పదిలపరుచుకోవడంలో భాగంగానే స్నాప్‌డీల్ యాజమాన్యం కొఠారిని సీఈవోగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఫ్రీఛార్జ్‌లో అదనంగా మరో 20 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు స్నాప్‌డీల్ తెలిపింది. కొఠారి గతంలో సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ కంపెనీ హౌసింగ్.కామ్‌కు సీఈవోగా వ్యవహరించారు. ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయానికి 8 ఉత్తమ మార్గాలు


Click it and Unblock the Notifications
