ఈ ఏడాది 6 వేల మందిని తొలగించనున్న కాగ్నిజెంట్
కాగ్నిజెంట్ ఈ ఏడాది రెగ్యులర్ అప్రైజల్ సైకిల్ లో భాగంగా 6వేల మందిని తొలగిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కాగ్నిజెంట్ ఉద్యోగులకు ఇది చాలా క్లిష్టమైన సమయమని, ఉద్యోగులు తమకు తాముగా నైపుణ్యాల అభివృ
ఆటోమేషన్ ప్రభావం ఐటీ ఉద్యోగులను భారీగా కలవరపెడుతోంది. ఐటీ కంపెనీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా అమెరికా టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ 6000 మందికి ఉద్వాసన పలకబోతున్నట్టు తెలుస్తోంది. అంటే మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 2.3శాతం మందిని సీటీఎస్ తీసేస్తోంది. కొత్త డిజిటల్ సర్వీసులోకి మరలే క్రమంలో సాఫ్ట్‌వేర్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభంతో కంపెనీలు ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాగ్నిజెంట్ కూడా ఈ ఏడాది రెగ్యులర్ అప్రైజల్ సైకిల్ లో భాగంగా 6వేల మందిని తొలగిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కాగ్నిజెంట్ ఉద్యోగులకు ఇది చాలా క్లిష్టమైన సమయమని, ఉద్యోగులు తమకు తాముగా నైపుణ్యాలను అభివృద్ది చేసుకోలేని పక్షంలో కంపెనీలో కొనసాగడం కష్టతరమని పేర్కొన్నాయి.
ఉద్యోగ బీమా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ఈ సాఫ్ట్‌వేర్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 2,65,000 మంది ఉద్యోగులుండగా... వారిలో 1,88,000 మంది భారత్ లో ఉన్నారు. గతేడాది కూడా కాగ్నిజెంట్ తమ వర్క్ ఫోర్స్ లో 1-2 శాతం తగ్గించుకుంది. అయితే ప్రస్తుతం ఎంతమందిని తీసేస్తున్నట్టో కంపెనీ స్పష్టంచేయనప్పటికీ, సంబంధిత వర్గాల ప్రకారం 6000 మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్ లు ఖాయమంటూ వెల్లడవుతోంది. తమ వర్క్ ఫోర్స్ మేనేజ్ మెంట్ స్ట్రాటజీలో ఎప్పటికప్పుడూ ఉద్యోగుల పనితీరుపై సమీక్షలు జరుగుతూ ఉంటాయని, క్లయింట్ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, వ్యాపార లక్ష్యాలను సాధించాల్సి ఉంటుందని కాగ్నిజెంట్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా కంపెనీ ఏ చర్య తీసుకున్నా... అది పనితీరు ప్రకారమే ఉంటుందని చెప్పారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications