For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేవ‌లం 17

శ‌నివారం రోజు ఎన్నిక‌ల ఫ‌లితాల వెల్ల‌డి నేప‌థ్యంలో మార్కెట్లు ఆచితూచి స్పందించాయి. రోజంతా ఫ్లాట్‌గా కొన‌సాగిన సూచీలు చివరికి తిరిగి కోలుకుని స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌

|

శ‌నివారం రోజు ఎన్నిక‌ల ఫ‌లితాల వెల్ల‌డి నేప‌థ్యంలో మార్కెట్లు ఆచితూచి స్పందించాయి. రోజంతా ఫ్లాట్‌గా కొన‌సాగిన సూచీలు చివరికి తిరిగి కోలుకుని స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 17 పాయింట్లు పెరిగి 28,946 వద్ద నిలవగా.. నిఫ్టీ 7 పాయింట్లు బలపడి 8,934 వద్ద స్థిరపడింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 29,000 పాయింట్ల దిగువన సెన్సెక్స్‌, 8,950 దిగువన నిఫ్టీ స్థిరపడ్డాయి. తొలుత ఒక దశలో సెన్సెక్స్‌ 29,076 వద్ద గరిష్టాన్ని తాకగా... నిఫ్టీ సైతం 8,976కు చేరింది. వచ్చే వారం పాలసీ సమీక్షను చేపట్టనున్న అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచే అంచనాలు బలపడటంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

sensex ended with 17 points gain

ఎన్‌ఎస్‌ఈలో ఆటో, ఐటీ రంగాలు 0.25 శాతం బలపడగా.. లోహ రంగం అత్యధికంగా 0.6 శాతం క్షీణించింది. పీఎస్‌యూ బ్యాంక్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 0.3 శాతం చొప్పున నీరసించాయి. బ్లూచిప్స్‌లో బాష్‌, భారతీ, ఇన్‌ఫ్రాటెల్‌, యస్‌బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ 1 నుంచి 3.3 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే టెక్ మహీంద్రా, బీపీసీఎల్‌, గ్రాసిమ్‌, ఐసీఐసీఐ, ఎన్‌టీపీసీ 1 నుంచి 2.6 శాతం మధ్య నష్టపోయాయి.

English summary

కేవ‌లం 17 | sensex ended with 17 points gain

Shares ended steady on Friday, posting small weekly gains, as investors anxiously await the results of state elections, which could boost Prime Minister Narendra Modi's chances of winning the 2019 general election.
Story first published: Friday, March 10, 2017, 17:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X