పీఎఫ్ 15 రోజుల్లో విత్‌డ్రా చేసుకోవ‌చ్చా!

ఇప్పటివరకు జీపీఎఫ్‌ చందాదారులు తమ పిల్లల కోసం ఉన్న‌త విద్య కోస‌మే ఈ మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యకు సంబంధించి దేనికైనా జీపీఎఫ్‌ నుంచి విత్‌డ్రా చేసుకునే అవ

కేవ‌లం కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మాత్రమే
దాదాపు 50 లక్షలకు పైగా ఉన్న‌ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త. ఉద్యోగ భ‌విష్య నిధి(జీపీఎఫ్‌) నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేందుకు ఉద్దేశించిన నియమాలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. కేవలం 15 రోజుల్లోపే ఈ మొత్తాన్ని ఉద్యోగులు విత్‌డ్రా చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఇప్పటివరకు పదిహేనేళ్ల సర్వీసు పూర్తయితే తప్ప జీపీఎఫ్‌ నుంచి విత్‌డ్రా చేసుకునేందుకు అవ‌కాశం ఉండేది కాదు. తాజా నిబంధనల ప్రకారం ఈ గ‌డువును ప‌దేళ్ల‌కు కుదించారు. అలాగే ఇప్పటివరకు జీపీఎఫ్‌ చందాదారులు తమ పిల్లల కోసం ఉన్న‌త విద్య కోస‌మే ఈ మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యకు సంబంధించి దేనికైనా జీపీఎఫ్‌ నుంచి విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని క‌ల్పించ‌బోతున్నారు. అలాగే నిశ్చితార్థం, వివాహం, అస్వస్థత(అనారోగ్య చికిత్స‌) తదితర ముఖ్య అవసరాల నిమిత్తం కూడా జీపీఎఫ్‌ నుంచి నిధులను తీసుకునే అవకాశాన్ని కల్పించింది.

పీఎఫ్ 15 రోజుల్లో విత్‌డ్రా చేసుకోవ‌చ్చా!

ప్రభుత్వోద్యోగులనుంచి వచ్చిన సలహాలు, వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని జీపీఎఫ్‌ నిబంధనల్లో మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆయా చందాదారుల ఖాతాలో వుండే మొత్తంలో నాలుగింట మూడోవంతు లేదా 12 నెలల జీతాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది. అస్వస్థతకు సంబంధించి 90 శాతం వరకు జీపీఎఫ్‌ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే పదేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత సదరు చందాదారు తన ఖాతాలో వున్న మొత్తాన్ని వెనక్కి తీసుకునే అవకాశం కూడా కల్పించింది. ఈ మొత్తాలను గరిష్ఠ స్థాయిలో పదిహేను రోజుల్లోపే చెల్లించడం జరుగుతుందని కూడా ఈ ఉత్తర్వులో ప్రభుత్వం స్పష్టం చేసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+