దాదాపు 100 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
వరుసగా రెండో రోజూ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 98 పాయింట్ల(0.34%) నష్టంతో 28,902 వద్ద స్థిరపడగా; నిఫ్టీ 23(0.25%)పాయింట్ల క్షీణత తర్వాత 8924 వద్ద ముగిసింది. ఒక పక్క మన దేశంలో
వరుసగా రెండో రోజూ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 98 పాయింట్ల(0.34%) నష్టంతో 28,902 వద్ద స్థిరపడగా; నిఫ్టీ 23(0.25%)పాయింట్ల క్షీణత తర్వాత 8924 వద్ద ముగిసింది. ఒక పక్క మన దేశంలో ఎన్నికల ఫలితాలపై అంచనాల విశ్లేషణలు, మరో వైపు వచ్చే వారం అమెరికా పెడరల్ రిజర్వ్ సమావేశం ఉండటంతో ట్రేడర్లు ఆచితూచి స్పందించారు. బుధవారం ఉదయం మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం ట్రేడింగ్లో 100కు పైగా నష్టాల్లోకి పోయిన సెన్సెక్స్ సాయంత్రానికి కాస్త కోలుకుంది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే లోహ రంగం(1.91%) అత్యధికంగా నష్టపోయింది. తర్వాత స్థిరాస్తి(1.44%), చమురు,సహజవాయు(1.38%) రంగాలు ఉండగా మౌలికం రంగం(1.07%) సైతం నష్టాలకు గురైంది. మరో వైపు హెల్త్ కేర్(0.21%), బ్యాంకింగ్(0.16%) రంగాలు లాభపడ్డాయి.
సెన్సెక్స్‌లో నష్టాలకు గురైన వాటిలో టాటాస్టీల్, ఓఎన్‌జీసీ, ఎమ్ అండ్ ఎమ్, ఇన్ఫోసిస్, గెయిల్ ముందు ఉండగా; లాభపడ్డ వాటిలో ఎస్‌బీఐ(0.62%), టీసీఎస్, సిప్లా, పవర్ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.


Click it and Unblock the Notifications
