ఉచిత గ్యాస్ సబ్సిడీకి సైతం ఆధార్ తప్పనిసరి
ఇకపై ఉచిత గ్యాస్ సబ్సిడీని పొందేందుకు ఆధార్ వివరాలు తప్పక ఇవ్వాల్సిందే.దారిద్ర్యరేఖకు దిగువ ఉన్న మహిళలంతా ఆధార్ వివరాలను మే31 లోపు సమర్పించాల్సిందేనని కేంద్రం వెల్లడించింది.గతేడాది పహ
ఇకపై ఉచిత గ్యాస్ సబ్సిడీని పొందేందుకు ఆధార్ వివరాలు తప్పక ఇవ్వాల్సిందే. దారిద్ర్యరేఖకు దిగువ ఉన్న మహిళలంతా ఆధార్ వివరాలను మే31 లోపు సమర్పించాల్సిందేనని కేంద్రం వెల్లడించింది. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందాలంటే వారంతా గడువు లోపు ఆధార్ కోసం ఎన్‌రోల్ చేసుకోవాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. గత ఏడాది పహల్ పథకం కింద సబ్సిడీ సిలిండర్లను పొందాంటేనే ఆధార్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.

గత వారం రోజులుగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకానికి అర్హులుగా ఉన్న వారు సైతం ఆధార్ సమర్పించేలా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన కింద కేంద్రం ఇప్పటికే 1.67 కోట్ల కొత్త గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేసింది. దేశవ్యాప్తంగా ధనవంతులు(అధిక ఆదాయ వర్గాల వారు) స్వచ్చందంగా గ్యాస్ సబ్సిడీని వదులుకోవడంతో ఆ ప్రయోజనాలన్నీ కింది స్థాయి వర్గాలకు బదలాయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్ని చేస్తున్నా ఇప్పటికీ గ్రామాల్లో కొంత మంది గ్యాస్ వాడకుండా కట్టెల పొయ్యి వాడుతుండటంతో కేంద్రం దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ గ్యాస్ ఉండేలా చూసేందుకు పలు చర్యలను చేపడుతోంది. అయితే ఇక్కడ అక్రమాలు చోటుచేసుకునే వీలుండటంతో ఆధార్ సాయంతో లబ్దిదారులకు మేలు జరిగేలా, పథకం ద్వారా అనర్హులను కట్టడి చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications