ప్రైవేట్‌రంగ బ్యాంకులు నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలపై విధించిన చార్జీలను 70 శాతం ఖాతాదారులు వ్యతిరేకిస్తున్నారు. పాత పెద్ద నోట్ల రద్దు కష్టాలు కొలిక్కి వస్తుండటం, నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలనే
ప్రైవేట్‌రంగ బ్యాంకులు నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలపై విధించిన చార్జీలను 70 శాతం ఖాతాదారులు వ్యతిరేకిస్తున్నారు. పాత పెద్ద నోట్ల రద్దు కష్టాలు కొలిక్కి వస్తుండటం, నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలనే ప్రభుత్వ లక్ష్యానికి మద్దతుగా ఖాతాదారుల నగదు లావాదేవీలపై ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజాలైన హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్‌లు రుసుములను ఒక్కసారిగా పెంచేశాయి. నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు నెలలో నాలుగుసార్లు మించితే ఒక్కో లావాదేవికి ఏకంగా 150 రూపాయలను వసూలు చేస్తామని ప్రకటించాయి. సేవింగ్స్ ఖాతాలతోపాటు వేతన ఖాతాదారులకు (సాలరీ అకౌంట్స్) ఈ చార్జీలు వర్తిస్తాయని, ఈ నెల 1 నుంచే అమల్లోకి వస్తాయని చెప్పాయి. అయతే దీనిపై లోకల్ సర్కిల్స్ నిర్వహించిన అధ్యయనంలో 70 శాతం మంది వ్యతిరేకత కనబరిచారు.

మరోవైపు ప్రభుత్వం కూడా దీనిపై పునరాలోచించుకోవాలని ప్రైవేట్‌రంగ బ్యాంకర్లను కోరింది. ఎస్బీఐ సైతం చార్జీలను పెంచడం సామాన్యుడిని ఆగ్రహానికి గురిచేస్తోంది. ఒక్కసారి ఎస్బీఐ విలీనం పూర్తయితే దేశంలో సగం మంది బ్యాంకు ఖాతాదారులకు స్టేట్ బ్యాంకే సేవలందిస్తుంది. అలాంటిది ఒకపక్క ఫైనాన్సియల్ ఇన్‌క్లూజన్ గురించి మాట్లాడుతూ మరో వైపు ఇలా చార్జీలు పెంచడమేంటని ఆర్థిక నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌బీఐ, ప్రభుత్వం ఏ మేలు కోసం ఈ చర్యలకు అంగీకరించాయో వివరించాల్సిందేనని కస్టమర్లు పట్టుబడుతున్నారు. కొన్ని చోట్ల బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు ఉద్యోగులతో సైతం వాగ్వాదానికి దిగుతున్నారు. దీనికి బ్యాంకు శాఖల్లో పనిచేసే ఉద్యోగులు చేయగలిగిందేమీ లేదు. కస్టమర్లంతా ఆర్‌బీఐకి, ప్రభుత్వానికి లేఖల,మెయిల్స్ ద్వారా విన్నపాల ద్వారా తమ అభ్యంతరాలను తెలపాల్సిందిగా మనవి. రెండు, మూడు రోజుల నుంచి నెటిజన్లు ఆర్బీఐ, బ్యాంకులపైన సామాజిక మాధ్యమాల్లో వ్యంగాస్త్రాలను సైతం సంధిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications