హెచ్-1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ విషయాన్ని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) వెల్లడించింది. ఏప్రిల్
హెచ్-1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ విషయాన్ని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) వెల్లడించింది. ఏప్రిల్ 3 నుంచి హెచ్1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ రద్దు అమల్లోకి రానుంది. దాదాపు 6 నెలల పాటు ప్రీమియం పెండింగ్‌లో ఉన్న రెగ్యులర్ హెచ్-1బీ వీసాల దరఖాస్తులను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అగ్ర రాజ్యం వెల్లడించింది. ప్రత్యేక ఫీజుతో హెచ్-1బీ వీసాల ప్రాసెస్ త్వరగా పూర్తిచేసుకునే 'ప్రీమియం ప్రాసెసింగ్'కు మాత్రమే ఈ తాత్కాలిక రద్దు వర్తిస్తుంది. అదనంగా 1,125డాలర్లు చెల్లిస్తే కంపెనీలు దరఖాస్తు చేసే ప్రీమియం ప్రాసెసింగ్‌కు అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం దీన్ని కొన్ని నెలల పాటు రద్దు చేశారు. రెగ్యులర్ హెచ్-1బీ వీసాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీన్ని హెచ్1-బీ వీసాల సస్పెన్షన్‌గా పరిగణించకూడదని ఇమ్మిగ్రేషన్ విభాగం శుక్రవారం వెల్లడించింది.

హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్ సమయం తగ్గించడానికి ఈ తాత్కాలిక రద్దు ఉపయోగపడుతుందని యూఎస్‌సీఐఎస్ తెలిపింది. ప్రీమియం ప్రాసెసింగ్‌కు 15 రోజుల సమయం పడుతుండగా, రెగ్యులర్ హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్‌కు మూడు నెలలకు పైగా పడుతోంది. ప్రీమియం ప్రాసెసింగ్ అప్లికేషన్ల వల్ల రెగ్యులర్ దరఖాస్తుల ప్రాసెసింగ్ సమయం బాగా పెరిగిపోతోందని అందుకే వాటిని తాత్కాలికంగా రద్దు చేయాలని భావిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. అమెరికాలో ఉద్యోగం చేసుకోవడానికి నైపుణ్యంగల వారికి ఇచ్చే తాత్కాలిక వర్క్ వీసా హెచ్-1బీని ఎక్కువగా భారత ఐటీ ఇంజినీర్లు వినియోగిస్తున్నసంగతి తెలిసిందే.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications