స్వ‌ల్ప‌ నష్టాల‌తో ముగిసిన మార్కెట్లు

వరుసగా రెండో రోజు ఇన్వెస్ట‌ర్లు లాభాల స్వీక‌ర‌ణ‌కు దిగ‌డంతో శుక్ర‌వారం సైతం మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. రోజు మొత్తం నష్టాల మధ్యే కదిలినప్పటికీ చివర్లో కోలుకున్నాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి ప్రధాన స

వరుసగా రెండో రోజు ఇన్వెస్ట‌ర్లు లాభాల స్వీక‌ర‌ణ‌కు దిగ‌డంతో శుక్ర‌వారం సైతం మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. రోజు మొత్తం నష్టాల మధ్యే కదిలినప్పటికీ చివర్లో కోలుకున్నాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి ప్రధాన సూచీలు పెద్ద‌గా లాభ‌న‌ష్టాలు లేకుండా అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్‌ 7 పాయింట్లు క్షీణించి 28,832 వద్ద ముగియ‌గా, నిఫ్టీ 2 పాయింట్ల నామమాత్ర నష్టంతో 8,898 వద్ద నిలిచింది. ప్రపంచ మార్కెట్ల నష్టాలు, ట్రేడర్ల లాభాల స్వీకరణ వంటి అంశాల నేపథ్యంలో ఒక దశలో సెన్సెక్స్‌ 130 పాయింట్లవరకూ క్షీణించగా.. నిఫ్టీ 8,860 వద్ద కనిష్టాన్ని తాకింది.

స్వ‌ల్ప‌ నష్టాల‌తో ముగిసిన మార్కెట్లు

మార్కెట్లకు ప్రధానంగా ఐటీ, మెటల్‌, ఫార్మా రంగాలు 0.6 శాతం చొప్పున పుంజుకోవడం ద్వారా ద‌న్నుగా నిలిచాయి. స్క్వేరప్‌ లావాదేవీల కారణంగా రియల్టీ సైతం 1 శాతం జంప్‌చేసింది. అయితే పీఎస్‌యూ బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 0.7 శాతం చొప్పున నష్టపోవడం ద్వారా మార్కెట్లను దెబ్బతీశాయి. నిఫ్టీ దిగ్గజాలలో బాష్‌, హెచ్‌డీఎఫ్‌సీ, అంబుజా, ఏషియన్‌ పెయింట్స్‌, ఐషర్, ఏసీసీ, బీవోబీ, ఐసీఐసీఐ, ఐటీసీ 1 నుంచి 2 శాతం మధ్య నష్టపోవడం ద్వారా మార్కెట్లను బలహీనపరచాయి. కాగా, సీఎల్‌ఎస్‌ఏ అప్‌గ్రేడ్‌ చేయడంతో ఇన్‌ఫ్రాటెల్‌ 6 శాతంపైగా ఎగ‌సింది. క్విప్‌ ద్వారా నిధుల సమీకరణ కారణంగా హిందాల్కో 5 శాతం ఎగసింది. ఈ బాటలో గెయిల్‌, గ్రాసిమ్‌, ఆర్‌ఐఎల్‌, సన్‌ ఫార్మా, యాక్సిస్‌, హీరోమోటో, ఐడియా, అదానీ పోర్ట్స్ 1 నుంచి 3.5% శాతం మధ్య బలపడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+