ప్రపంచ మార్కెట్ల కారణంగా ఉత్సాహంతో కదిలిన మార్కెట్లు ముగింపు సమయానికి డీలా పడ్డాయి. మిడ్ సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో దాదాపు రెండేళ్ల గరిష్ట స్థాయి నుంచి నష్టాల దిశగా అడుగులు వేశాయి. ట
స్థిరాస్తి, ఫార్మా రంగాల్లో లాభాల స్వీకరణ
ప్రపంచ మార్కెట్ల కారణంగా ఉత్సాహంతో కదిలిన మార్కెట్లు ముగింపు సమయానికి డీలా పడ్డాయి. మిడ్ సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో దాదాపు రెండేళ్ల గరిష్ట స్థాయి నుంచి నష్టాల దిశగా అడుగులు వేశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 145 పాయింట్లు క్షీణించి 28,840 వద్ద నిలిచింది. తద్వారా 29,000 పాయింట్ల కీలకస్థాయి దిగువన ముగిసింది. నిఫ్టీ సైతం 46 పాయింట్లు తక్కువగా 8,900 వద్ద స్థిరపడింది. మూడో త్రైమాసికంలో 7 శాతం వృద్ధి సాధించిన జీడీపీ కారణంగా బుధవారం మార్కెట్లు భారీగా లాభపడ్డ సంగతి తెలిసిందే. అటు యూరప్, అమెరికా మార్కెట్లు సైతం 1.5-2 శాతం లాభపడటంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా కనిపించింది. దీంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు ప్రోత్సాహకరంగా మొదలయ్యాయి. ఈ ప్రభావంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 29,145 పాయింట్లను తాకగా.. నిఫ్టీ 8,992కు ఎగసింది. తద్వారా మరోసారి 9,000 మైలురాయికి చేరువైంది. మిడ్ సెషన్ నుంచీ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం, యూరోపియన్ మార్కెట్లు లాభాల నుంచి నష్టాలలోకి మళ్లడం వంటి అంశాల కారణంగా ఒక్కసారిగా సెంటిమెంటును బలహీనపరిచాయని విశ్లేషకులు పేర్కొన్నారు.

స్థిరాస్తి, ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగినట్లుగా
మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగంతో పెట్టుబడిదారులకు జోష్ వచ్చినా చివరి వరకూ మార్కెట్లలో అదే ఉత్సాహం కొనసాగలేదు. టాటా మోటార్స్‌తో పాటు పలు వాహన రంగ దిగ్గజాలు నెలవారీ అమ్మకాల్లో మంచి పురోగతి కనబరచడంతో వాహన రంగ షేర్లు బాగా లాభాలను స్వీకరించాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications