రిలయన్స్‌కు దీటుగా నిలబడేందుకు ఎయిర్‌టెల్ ఏం చేస్తోంది?
కాల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌లపై ఉచిత రోమింగ్ సేవలు అందించనుందని, ఔట్ గోయింగ్ చార్జీలపై కూడా ఎలాంటి అదనపు చార్జీలు ఉండబోవని ఎయిర్ టెల్ సోమవారం ప్రకటించింది. డేటా సేవల్లోనూ నేషనల్ రోమింగ్‌పై ఎలాంటి అదనపు చార
దేశీయ టెలికాం దిగ్గజం తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌లపై ఉచిత రోమింగ్ సేవలు అందించనుందని, ఔట్ గోయింగ్ చార్జీలపై కూడా ఎలాంటి అదనపు చార్జీలు ఉండబోవని ఎయిర్ టెల్ సోమవారం ప్రకటించింది. డేటా సేవల్లోనూ నేషనల్ రోమింగ్‌పై ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ ప్రకటనలోని మరిన్ని ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం.

ఏప్రిల్ 1 నుంచి నో రోమింగ్
రిలయన్స్ జియోనుంచి పెరిగిన ఒత్తిడి నేపథ్యంలో భారతి ఎయిర్ టేల్ వినియోగదార్లకు శుభవార్త అందించింది. ఊహించినట్లుగానే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కాల్,డేటా చార్జీలు బెడద లేకుండా మొబైల్ సేవలను ఉపయోగించుకోవచ్చని మార్కెట్ లీడర్ ఎయిర్ టెల్ సోమవారం ప్రకటించింది. ఏప్రిల్ 1 2017నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు ఎయిర్ టెల్ తెలిపింది.

కొత్త చరిత్రకు శ్రీకారం: సీఈవో గోపాల్ మిట్టల్
మొబైల్ సేవలలో ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవడంలో భాగంగా దేశవ్యాప్తంగా రోమింగ్ కాల్స్‌కు ప్రీమియం చార్జీల రద్దు చేస్తున్నట్టు భారతి ఎండీ, సీఈవో గోపాల్ మిట్టల్ ప్రకటించారు. ఏ దేశంలోఅడుగుపెట్టినా తమ యూజర్లు తమ మొబైల్ ఫోన్లను ఆన్ లో ఉంచుకోవచ్చని తద్వారా మొబైల్ నెట్ వర్క్‌లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నట్టు చెప్పారు.

రోమింగ్‌లో మార్పులు: సునీల్ మిట్టల్
తమ వినియోగదారులు ప్రపంచంలోని ప్రతి మూలలో ఎయిర్ టెల్ నెంబర్ ను అనుమతించేలా అంతర్జాతీయ రోమింగ్ రూపంలో భారీ మార్పులు తీసుకొస్తున్నామని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశ్రమ ఆపరేటర్లు ధర అడ్డంకులను తొలగించడానికి సహకరించాలనీ, అన్యాయమైన బిల్లుల భయం లేకుండా కనెక్ట్ అయ్యేలా వినియోగదారులకు ఆఫర్లను అందించాలని కోరారు.

డేటా చార్జీలు 99% తగ్గింపు: ఎయిర్‌టెల్
ఈ సందర్భంగా వినియోగదారులకు కాల్ మరియు డేటా వినియోగం కోసం ఆకర్షణీయమైన మూడుప్యాకేజీలను ప్రకటించింది. 1, 5, 30రోజుల పథకాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రముఖ ప్రాంతాల్లో కాల్ చార్జీలను నిమిషానికి మూడు రూపాయలతో 90 శాతం, 3 ఎంబీ డాటాతో డేటా ఛార్జీలను 99 శాతం తగ్గించినట్టు ఎయిర్ టెల్ చెప్పింది.

వన్‌డే ప్యాక్‌లు
అమెరికావెళ్లే భారతీయ యూజర్లు రూ.649 కు పైబడి వాడితే ఆటోమేటిగ్గా వన్‌డే ప్యాక్ లోకి మారతారని, తద్వారా ఉచిత ఇన్ కమింగ్‌కాల్స్, ఎస్‌ఎంఎస్‌లతో పాటు 100 నిమిషాల ఇండియా, అమెరికా లోకల్ టాక్ టైం, 300ఎంబీ డాటా పొందుతారని తెలిపింది. అలాగే సింగపూర్ వెళ్లే (రూ.499) కస్టమర్ కూడా వన్ డేప్యాక్ కు తరలిస్తామని తెలిపింది.

ఎయిర్‌టెల్ షేర్ల క్షీణత
దీంతో రోమింగ్‌లో ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను కూడా ఉచితంగా అందించే వాటిలో ఎయిర్‌టెల్ కూడా వచ్చి చేరింది. అంతేకాదు డేటా రోమింగ్ చార్జీలూ ఉండబోవు. ఈ వార్తల నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్ కౌంటర్లో సోమవారం అమ్మకాలు తలెత్తాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో భారతీ దాదాపు 3% నష్టపోయింది.


Click it and Unblock the Notifications